నిజంగా అతిలోక సుందరే...!
నటిగా శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తరగదు. చెన్నైలో పుట్టి..తెలుగులో కెరీర్ ప్రారంభించి.. బాల నటిగా తెరంగట్రమ్ చేసి.. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగింది. దక్షిణాది లో సూపర్ స్టార్ అయిన తరువాత.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే అక్కడ నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశారు శ్రీదేవి. అయితే 2004-05 మధ్యకాలంలో మాలినీ అయ్యర్‌గా బుల్లితెర మీద కొద్దికాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లే మాలినీ […]
నటిగా శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తరగదు. చెన్నైలో పుట్టి..తెలుగులో కెరీర్ ప్రారంభించి.. బాల నటిగా తెరంగట్రమ్ చేసి.. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగింది. దక్షిణాది లో సూపర్ స్టార్ అయిన తరువాత.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే అక్కడ నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశారు శ్రీదేవి. అయితే 2004-05 మధ్యకాలంలో మాలినీ అయ్యర్‌గా బుల్లితెర మీద కొద్దికాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లే మాలినీ అయ్యర్ పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ సీరియల్ అయిపోయాక రెండు మూడుసార్లు టీవీ షోలకు హాజరుకావడం తప్ప నటిగా మళ్లీ తెర మీదకు రాలేదు. అయితే, నిర్మాతగా పోకిరి చిత్రాన్ని హిందీలో సల్మాన్‌తో ‘వాంటెడ్’గా నిర్మించారు. 2012లో వచ్చిన ‘ఇంగ్లీష్-వింగ్లీష్’ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. త్వరలో భర్త బోనీ కపూర్ నిర్మాణంలో ‘మిస్టర్ ఇండియా-2’ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఏళ్లు గడిచినా మరచిపోలేని నటిమణుల్లో శ్రీదేవి ఒకరు. ఆమే 53 వ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా బ్రీఫ్ గా…
ప్రొఫైల్
పేరు: శ్రీదేవి
అసలు పేరు: శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్
ముద్దుపేరు: పప్పీ
బలం: కుటుంబం
నచ్చే దుస్తులు: చీరలు
ఇష్టపడేవి: పమేరియన్ కుక్కపిల్లలు, పైనాపిల్ ఐస్‌క్రీం, షూటింగ్ అయిపోయాక ప్యాక్ టైం
మరిచిపోలేనిది: చాల్‌బాజ్ చిత్రానికి ఫిలింఫేర్
ఒత్తిడికి గురిచేసేవి: రీమేక్‌ల్లో చేసే రీటేక్‌లు
ఆహ్లాదాన్నిచ్చేవి: ఆ రీమేకులు హిట్టవడం
అమ్మంటే ప్రాణం
శ్రీదేవి చిన్నప్పటి నుంచి అమ్మ కూచీయే. ఆమెకి తల్లితో ఉన్న అనుబంధం ఎక్కువ. ఆమె మరణం తనకు తీరని లోటని శ్రీదేవి చెబుతుంటారు. తల్లి మరణం తర్వాత శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత, హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీకపూర్‌ను జూన్2, 1996న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. జాహ్నవి, ఖుషి.
సత్కారాలు: 2013లో భారత్ ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ 100 ఇయర్స్’కి శ్రీదేవికి ఓట్లు వచ్చాయి.
అభిమానులకి చెప్పాలనుకునేది: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండమని..
తెలుగుగ్లోబల్.కామ్ ..మరియు ప్రపంచ వ్యాప్తంగా ఆమే అభిమానుల తరుపున అతిలోక సుందరి శ్రీదేవి గారికి బర్త్ డే విషేష్.
Click on Image to Read: