గోదావరి అంటే రాజమండ్రి, కృష్ణా అంటే బెజవాడేనా..?

ఉమ్మడి రాష్ట్రంలో పుష్కరాల విషయంలోనూ తెలంగాణపై వివక్ష చూపారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. అలంపూర్‌లో పుష్కర స్నానం చేసిన కేసీఆర్‌ దంపతులు అనంతరం అలంపూర్ జోగులాంబ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడ అన్నట్టుగా ప్రచారం చేశారన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. గత సంవత్సరం గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించామని…. కృష్ణా పుష్కరాలు కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పుష్కర స్నానం […]

Advertisement
Update:2016-08-12 05:18 IST

ఉమ్మడి రాష్ట్రంలో పుష్కరాల విషయంలోనూ తెలంగాణపై వివక్ష చూపారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. అలంపూర్‌లో పుష్కర స్నానం చేసిన కేసీఆర్‌ దంపతులు అనంతరం అలంపూర్ జోగులాంబ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడ అన్నట్టుగా ప్రచారం చేశారన్నారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. గత సంవత్సరం గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించామని…. కృష్ణా పుష్కరాలు కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పుష్కర స్నానం చేసి శక్తి పీఠాన్ని దర్శించుకునే అరుదైన స్థలం అలంపూర్ అని కేసీఆర్‌ అన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌తో దీనిపై చర్చిస్తామని వెల్లడించారు.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News