నా భార్య వల్లే అసహ్యం వేసింది...

ప్రిన్స్ మహేష్ బాబు. ఇది వరకు బయటకు కూడా పెద్దగా వచ్చేవాడు కాదు. సినిమాలో నటించడం వరకే తన పని అన్నట్టుగా ఉండేవారు. అయితే కొన్నేళ్లు ప్రిన్స్ కూడా సినిమా ఫంక్షన్లలో రెగ్యులర్‌గా కనిపిస్తున్నారు. ఈ మార్పులకు ఆయన సతీమణే కారణమని చెబుతుంటారు. లేటెస్ట్‌గా తన పుట్టిన రోజు సందర్భంగా తన గురించి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను మహేష్ వెల్లడించారు. తాను ఒకప్పుడు విపరీతంగా సిగరెట్లు తాడేవాడట. తాను చైన్‌ స్మోకర్‌నని మహేష్ స్వయంగా చెప్పారు. రోజూ […]

Advertisement
Update:2016-08-11 12:27 IST

ప్రిన్స్ మహేష్ బాబు. ఇది వరకు బయటకు కూడా పెద్దగా వచ్చేవాడు కాదు. సినిమాలో నటించడం వరకే తన పని అన్నట్టుగా ఉండేవారు. అయితే కొన్నేళ్లు ప్రిన్స్ కూడా సినిమా ఫంక్షన్లలో రెగ్యులర్‌గా కనిపిస్తున్నారు. ఈ మార్పులకు ఆయన సతీమణే కారణమని చెబుతుంటారు. లేటెస్ట్‌గా తన పుట్టిన రోజు సందర్భంగా తన గురించి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను మహేష్ వెల్లడించారు. తాను ఒకప్పుడు విపరీతంగా సిగరెట్లు తాడేవాడట. తాను చైన్‌ స్మోకర్‌నని మహేష్ స్వయంగా చెప్పారు. రోజూ ప్యాకెట్లు ప్యాకెట్లు కాల్చిపారేసేవాడట. తన తండ్రి కృష్ణ ఎంతగా చెప్పినా సిగరెట్లను మాత్రం మానలేకపోయానన్నారు. కానీ తన భార్య నమ్రత మాత్రం ఆ పనిలో విజయవంతమైందని చెప్పారు.

సిగరెట్లు తాగడంపై నమిత్ర ఇచ్చిన కౌన్సిలింగ్‌ బాగా పనిచేసిందని మహేష్ అన్నారు. సిగరెట్ అంటేనే అసహ్యం కలిగేలా నమ్రత తనను మార్చేసిందన్నారు. ఈజీ వే టు స్టాప్‌ స్మోకింగ్ అనే పుస్తకం కూడా తనపై బాగా ప్రభావం చూపిందన్నారు మహేష్. తన భార్య వల్ల సిగరెట్‌ను జయించగలిగానన్నారు. తనకు యాక్టింగ్‌ తప్ప వేరే ఆలోచనలు లేవని చెప్పారు. 90 ఏళ్లు వచ్చినా నటిస్తూనే ఉంటానన్నారు ప్రిన్స్. మహేష్‌ అభిమానులు కూడా ఆయనలాగే సిగరెట్ తాగడం మానేసి శభాష్ అనిపించుకుంటే బాగానే ఉంటుంది.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News