మానవహక్కుల కార్యకర్తకు ... వ్యక్తిగత హక్కులే హరించుకుపోయాయి!
నన్ను సాధారణ మనిషిగా చూడండి చాలు అంటున్నారు…మణిపూర్ ఉక్కుమహిళగా పేరు పొందిన ఇరోమ్ షర్మిల. తానేమీ దేవతని కానని అన్ని ఎమోషన్లు ఉన్న సాధారణ మనిషినని…తనని అలాగే చూడాలని ఆమె కోరుతున్నారు. ఎందుకంటే 16ఏళ్ల నిరాహార దీక్షని విరమించి సాధారణ జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకోగానే… ఆమె వెనుక అప్పటివరకు ఉన్న చాలామంది జనం అదృశ్యమయ్యారు. ముక్కులో ట్యూబ్తో ఉన్న నన్ను… మీ పోరాటానికి ఒక చిహ్నంలా చూడకండి…మీలాంటి మనిషి లాగే…అన్ని భావోద్వేగాలు ఉన్న మనిషిలాగే చూడండి….అని ఆమె […]
నన్ను సాధారణ మనిషిగా చూడండి చాలు అంటున్నారు…మణిపూర్ ఉక్కుమహిళగా పేరు పొందిన ఇరోమ్ షర్మిల. తానేమీ దేవతని కానని అన్ని ఎమోషన్లు ఉన్న సాధారణ మనిషినని…తనని అలాగే చూడాలని ఆమె కోరుతున్నారు. ఎందుకంటే 16ఏళ్ల నిరాహార దీక్షని విరమించి సాధారణ జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకోగానే… ఆమె వెనుక అప్పటివరకు ఉన్న చాలామంది జనం అదృశ్యమయ్యారు. ముక్కులో ట్యూబ్తో ఉన్న నన్ను… మీ పోరాటానికి ఒక చిహ్నంలా చూడకండి…మీలాంటి మనిషి లాగే…అన్ని భావోద్వేగాలు ఉన్న మనిషిలాగే చూడండి….అని ఆమె ఇప్పుడు తన తోటి మానవహక్కుల కార్యకర్తలను, ఆందోళన కారులను కోరుతున్నారు.
జనమే కాదు…మణిపూర్ ప్రజలందరి క్షేమం కోసం పోరాడటమే… తన లక్ష్యమంటున్న షర్మిలకు ఆమె కుటుంబం కూడా తోడుగా నిలవని స్థితి. ఇంఫాల్ కాంగ్ఖామ్ ప్రాంతంలో షర్మిల కుటుంబ సభ్యుల తాలూకూ ఇళ్లు ఏడున్నాయి. అయితే ఆందోళన కారులు ఆమె దీక్ష విరమణని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో షర్మిల ఇప్పుడు ఒంటరి అయ్యారు. తన లక్ష్యం నెరవేరే వరకు తల్లి వద్దకు వెళ్లనని షర్మిల చెప్పారు. అయితే ఇప్పుడు కూతురు తీసుకున్న దీక్ష విమరణ నిర్ణయంతో… ఆమె జీవితంలో ప్రత్యేకంగా వచ్చే ఆనందం, విషాదం ఏమీ ఉండదని షర్మిల తల్లి అభిప్రాయపడ్డారు.
మంగళవారం ఆమె ఇంఫాల్లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి నాలుగు గంటలకు బయటకు వచ్చాక ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితి. పోలీసులు ఆమెని మానవహక్కుల కార్యకర్త, మాజీ హెల్త్ డైరక్టర్ అయిన తియాం సురేష్ ఇంటికి తీసుకువెళ్లారు. అయితే అక్కడ కొంతమంది మహిళలు ఆమెని అడ్డుకున్నారు. మరో ప్రాంతంలో కూడా ఆమెకు అలాంటి నిరాదరణే ఎదురయ్యాక పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. స్థానికంగా ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ప్రార్థన చేసుకున్న తరువాత…రాత్రి పదిగంటలకు ఎక్కడికి వెళ్లాలో తెలియని షర్మిలను తిరిగి ఆసుపత్రికి చేర్చారు. ఆమె ఆసుపత్రిలోనే సురక్షితంగా ఉంటారని…పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి అన్నారు.
అంతకుముందు సేవ్ షర్మిల…అంటూ ఆందోళన చేసినవారే ఇప్పుడు ఆమెపై నిప్పులు కురిపిస్తున్నారు. మా నమ్మకాన్ని వమ్ము చేసిందని మండిపడుతున్నారు. ఆందోళన కారులు ఆమె వివాహ నిర్ణయాన్ని కూడా తప్పుపడుతున్నారు.
కొందరు మాత్రం షర్మిల పరిస్థితికి బాధపడుతూ ఫేస్ బుక్లో పోస్టులు పెడుతున్నారు. ఆమె 16 ఏళ్లు మనకోసం పోరాటం చేశారు. కనీసం సాటి మనిషిగా గౌరవిద్దాం అంటున్నారు వారు. మొత్తానికి మానవహక్కులకోసం పోరాటం చేస్తున్న ఆమె ఇప్పుడు తన వ్యక్తిగత హక్కులకోసం అర్థించాల్సివస్తోంది.