కూతురి పెళ్లి....తండ్రి గుండెని అమర్చిన వ్యక్తి... తండ్రి స్థానంలో!
తండ్రి మరణించిన పదేళ్లకు ఆమె పెళ్లవుతోంది. తండ్రి తన పెళ్లికి లేరు కదా… అనే దిగులుతో ఆమె గుండె బరువెక్కింది. అయితే తన తండ్రి గుండెని దానం చేయగా ప్రాణం పోసుకున్న వ్యక్తి జీవించే ఉన్నాడు కదా… అని ఆమెకు గుర్తొచ్చింది. తండ్రి స్థానంలో నిలబడి తన పెళ్లి జరిపించడానికి అతనే సరైన వ్యక్తని భావించి….ఆయనకు తన మనసులోని కోరికని చెప్పింది. అందుకు ఆ పెద్దమనిషి ఆనందంగా ఒప్పుకున్నాడు. అమెరికాలో ఈ ఎమోషనల్ ఉదంతం చోటుచేసుకుంది. జెనీ […]
తండ్రి మరణించిన పదేళ్లకు ఆమె పెళ్లవుతోంది. తండ్రి తన పెళ్లికి లేరు కదా… అనే దిగులుతో ఆమె గుండె బరువెక్కింది. అయితే తన తండ్రి గుండెని దానం చేయగా ప్రాణం పోసుకున్న వ్యక్తి జీవించే ఉన్నాడు కదా… అని ఆమెకు గుర్తొచ్చింది. తండ్రి స్థానంలో నిలబడి తన పెళ్లి జరిపించడానికి అతనే సరైన వ్యక్తని భావించి….ఆయనకు తన మనసులోని కోరికని చెప్పింది. అందుకు ఆ పెద్దమనిషి ఆనందంగా ఒప్పుకున్నాడు. అమెరికాలో ఈ ఎమోషనల్ ఉదంతం చోటుచేసుకుంది.
జెనీ స్టెపియన్ (33) తండ్రి మైఖేల్ స్టెపియన్ 2006లో పిట్స్బర్గ్కి దగ్గరలోని స్విస్వాలేలో ఒక టీనేజ్ దొంగ చేతిలో హత్యకు గురయ్యాడు. మైఖేల్ బ్రెయిన్ డెడ్ కావటంతో ఆయన గుండెని దానం చేయడానికి కుటుంబం అంగీకరించింది. దాంతో అప్పటికే గుండె జబ్బుతో చివరిక్షణాల్లో ఉన్న థామస్కి మైఖేల్ గుండెని అమర్చారు డాక్టర్లు. ఆ తరువాత ఆ రెండు కుటుంబాల మధ్య స్నేహం నడుస్తోంది. ఉత్తరాలు, ఫోన్కాల్స్ ద్వారా ఇరు కుటుంబాల మధ్య అనుబంధం పెరిగింది. థామస్ హాలిడేస్లో మైఖేల్ భార్యకు తాజాపూలను పంపుతుండేవారు. అయితే వారెప్పుడూ కలుసుకున్నది లేదు.
ఈ క్రమంలో జెనీకి పెళ్లి కుదరటంతో ఆమె తనని చర్చికి నడిపించుకుని తీసుకువెళ్లే తండ్రి స్థానంలో థామస్ ఉంటే బాగుండునని కోరుకుంది. లారెన్స్విల్లేలో ఉంటున్న థామస్కి ఈ విషయం చెప్పినపుడు ఆయన ఆనందంగా అంగీకరించారు. అనుకున్నట్టుగానే జెనీ పెళ్లికి వచ్చి…ఆమె తండ్రిస్థానంలో ఉండి… చేయి పట్టుకుని చర్చిలోకి తీసుకువచ్చారు. పెళ్లి తంతుకి ముందు జెనీ…థామస్ గుండెపై చేయి వేసి తండ్రి నుండి ఆశీస్సులు పొందిన ఆనందాన్ని పొందగలిగింది.
72ఏళ్ల థామస్ సైతం జెనీ పెళ్లికి తండ్రిగా నిలవటం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ కుటుంబం వల్లనే తాను… తన పిల్లల చదువులు, వారు పెద్దవటం చూడగలిగానని…వారి పెళ్లిళ్లని కూడా చూస్తానని…ఇవన్నీ మైఖేల్ కుటుంబం కోల్పోయిందని..థామస్ అన్నారు. తనకు వారు చేసిన మేలుతో పోలిస్తే తాను వారికోసం చేసిన ఈ పని చాలా చిన్నదని ఆయన చెప్పారు.
Click on Image to Read: