వివేక్ టీఆర్ ఎస్‌లో చేరింది ఇందుకే!
వివేక్ మాజీ కాంగ్రెస్ నేత, ఎంపీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఉన్నపలంగా వివేక్ టీఆర్ ఎస్ పార్టీలోకి చేరడం వెనక భారీ ప్లాన్ ఉంది. తాను ఐదేళ్లపాటు పార్లమెంటులో పోరాడిన భారీ ప్రాజెక్టులు త్వరలో సాకారం కాబోతున్నాయి. ఆ క్రెడిట్‌ను అధికార పార్టీకి దక్కుతుంది. తాను కాంగ్రెస్‌లో ఉంటే తన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే, ఆయన పార్టీ మారాడు. ఇంతకీ వివేక్ పార్టీ మారడానికి బలమైన కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? […]
Advertisement
వివేక్ మాజీ కాంగ్రెస్ నేత, ఎంపీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఉన్నపలంగా వివేక్ టీఆర్ ఎస్ పార్టీలోకి చేరడం వెనక భారీ ప్లాన్ ఉంది. తాను ఐదేళ్లపాటు పార్లమెంటులో పోరాడిన భారీ ప్రాజెక్టులు త్వరలో సాకారం కాబోతున్నాయి. ఆ క్రెడిట్‌ను అధికార పార్టీకి దక్కుతుంది. తాను కాంగ్రెస్‌లో ఉంటే తన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే, ఆయన పార్టీ మారాడు. ఇంతకీ వివేక్ పార్టీ మారడానికి బలమైన కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి.
మాజీ ఎంపీగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా వివేక్ పేరు ఇప్పటి తరానికి బాగానే తెలుసు. అదే మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి కొడుకుగా మూడు తరాల వారికి ఇంకా బాగా తెలుసు. వెంకటస్వామి రెండో వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన వివేక్ పొలిటికల్ కెరీర్ ఎలాంటి ఆటంకాలు లేకుండానే సాగింది. తెలంగాణ ఉద్యమం, నియోజకవర్గ అభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చాడు. తండ్రి అనుచరులు వెంట ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండటం, సింగరేణి కార్మికుల ఓటు బ్యాంకు, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం… ఇలా ప్రతి విషయం వివేక్‌కి బాగా కలిసి వచ్చింది. వీటన్నింటిని ఉపయోగించుకుని చేతనైనన్ని పనులు చేసి తన పలుకుబడిని మరింతగా పెంచుకున్నాడు.
వివేక్ కి క్రెడిట్ తెచ్చిపెట్టిన పనులివే!
1. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు హైదరాబాద్ వెళ్లేందుకు రోజుకు కేవలం రెండే రైళ్లు అందుబాటులో ఉండేవి. మరోరైలును అదనంగా వేయించడంలో వివేక్ సక్సెస్ అయ్యాడు. పైగా ఆల్రెడీ నడుస్తోన్న రైళ్లకు మరిన్ని చోట్ల ఆగేలా చేసి రైల్వేను గ్రామీణులకు, యువతకు అందుబాటులోకి తీసుకొచ్చాడు.
2. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే పనులకు వెంటకస్వామి చేసిన పోరాటాన్ని పార్లమెంటులో తెలంగాణ ఎంపీలతో కలిసి కొనసాగించాడు.
3. ముఖ్యంగా తన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభానికి స్వయంగా విశ్వ ప్రయత్నాలు చేశాడు. దీంతో గత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తిరిగి తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఆ నిర్ణయాన్నే ఇప్పటి కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తాను అధికార పార్టీలో లేకుంటే ఇంతకాలం తాను చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే, కార్మికుల్లో తనకున్న క్రెడిబిలిటీ పోకుండా ఉండేందుకే ఆయన టీఆర్ ఎస్‌లోకి మారాడు.
Advertisement