వైసీపీలోకి డీసీసీ అధ్యక్షుడు... అంతలోనే గెంటేసిన కాంగ్రెస్

కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీవై రామయ్య  వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి అండతో 2013లో డీసీసీ అధ్యక్షుడిగా బీవై రామయ్య ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ కూడాచేశారు.  కానీ ఓడిపోయారు. అయినప్పటికీ జిల్లా అధ్యక్షుడిగా బీవై రామయ్యనే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరారు. జనమంతా వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అందుకే తాను కాంగ్రెస్‌ను వీడినట్టు చెప్పారు. శుక్రవారమే రామయ్య […]

Advertisement
Update:2016-08-06 07:13 IST

కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీవై రామయ్య వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి అండతో 2013లో డీసీసీ అధ్యక్షుడిగా బీవై రామయ్య ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ కూడాచేశారు. కానీ ఓడిపోయారు. అయినప్పటికీ జిల్లా అధ్యక్షుడిగా బీవై రామయ్యనే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరారు. జనమంతా వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అందుకే తాను కాంగ్రెస్‌ను వీడినట్టు చెప్పారు. శుక్రవారమే రామయ్య హైదరాబాద్ వచ్చారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయని వైసీపీ నుంచి సరైన హామీ వస్తే పార్టీలో చేరుతానని మీడియా ప్రతినిధులకు చెప్పారు. అయితే రామయ్య వైసీపీలో చేరడానికి ముందే ఆయనపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది. కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా లక్కసాగరం లక్ష్మిరెడ్డిని వెంటనే నియమించారు. లక్ష్మిరెడ్డి కూడా కోట్లకు అత్యంత సన్నిహితుడే.

కర్నూలులో ఐదుగురుఎమ్మెల్యేలు పార్టీ మారినా జనం మాత్రం వైసీపీ వెంటే ఉన్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి చెప్పారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News