గ్రామీ అవార్డుల‌కు గాయ‌త్రి మంత్రం...బౌద్ధమత సూక్తులు !

ప్ర‌ముఖ బాలివుడ్ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పీల‌హ‌రి  ఈసారి గ్రామీ అవార్డుల‌కు ఓ స‌రికొత్త పాట‌ని పంప‌నున్నారు. గాయ‌త్రి మంత్రం, బౌద్ధ‌మ‌త సూక్తుల‌ను కూర్చి కంపోజ్ చేసిన పాట‌ను గ్రామీ అవార్డు క‌మిటీకి పంప‌నున్న‌ట్టుగా ఆయ‌న తెలిపారు. ఇలాంటి పాటలు విదేశీయుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటాయ‌ని ఆయ‌న ఆన్నారు. తాను అన్ని మ‌తాల దేవుళ్ల‌కూ భ‌క్తుడినేన‌న్నారు. ప్ర‌పంచ ప్రసిద్ధి చెందిన గాయ‌ని టీనా ట‌ర్న‌ర్ ఎన్నో రాక్ సాంగ్‌ల‌ను పాడినా, ఆమె పాడిన మంత్రాలు శ్లోకాలు ఎంతో పాపుల‌ర్ అయ్యాయ‌ని […]

Advertisement
Update:2016-08-06 09:04 IST

ప్ర‌ముఖ బాలివుడ్ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పీల‌హ‌రి ఈసారి గ్రామీ అవార్డుల‌కు ఓ స‌రికొత్త పాట‌ని పంప‌నున్నారు. గాయ‌త్రి మంత్రం, బౌద్ధ‌మ‌త సూక్తుల‌ను కూర్చి కంపోజ్ చేసిన పాట‌ను గ్రామీ అవార్డు క‌మిటీకి పంప‌నున్న‌ట్టుగా ఆయ‌న తెలిపారు. ఇలాంటి పాటలు విదేశీయుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటాయ‌ని ఆయ‌న ఆన్నారు. తాను అన్ని మ‌తాల దేవుళ్ల‌కూ భ‌క్తుడినేన‌న్నారు.

ప్ర‌పంచ ప్రసిద్ధి చెందిన గాయ‌ని టీనా ట‌ర్న‌ర్ ఎన్నో రాక్ సాంగ్‌ల‌ను పాడినా, ఆమె పాడిన మంత్రాలు శ్లోకాలు ఎంతో పాపుల‌ర్ అయ్యాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు. త‌న‌కు బౌద్ద గురువులంటే చాలా ఇష్ట‌మ‌ని, తాను బౌద్ధ ధ‌ర్మ భ‌క్తుడిన‌ని ఆయ‌న చెప్పారు. బ‌ప్పీల‌హ‌రి ఇటీవ‌ల స్ల‌మ్ స్టార్స్ పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్‌ని తీశారు. ఆ చిత్రం అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో అవార్డుల‌ను సాధించింది.

Tags:    
Advertisement

Similar News