పంజాబ్‌లో 19 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్
పంజాబ్‌లో 19 మంది అభ్యర్థుల మొదటి జాబితాను ఆప్ గురువారం ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 సీట్లున్నాయి. ఆ రాష్ట్రంలో 2017 లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ 19 మందిలో అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులున్నారు. పంజాబ్‌లో జరుగనున్న ఎన్నికల ప్రచారానికి ఎంపీ భగవంత్‌మాన్ నేతృత్వం వహిస్తారని కూడా ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఇదిలా ఉండగా హాఫ్‌పోస్ట్-సీ ఓటర్ అనే సంస్థ నిర్వహించిన ఎన్నికల సర్వేలో ఆప్ 94 నుంచి 100 స్థానాల […]
Advertisement
పంజాబ్‌లో 19 మంది అభ్యర్థుల మొదటి జాబితాను ఆప్ గురువారం ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 సీట్లున్నాయి. ఆ రాష్ట్రంలో 2017 లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ 19 మందిలో అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులున్నారు. పంజాబ్‌లో జరుగనున్న ఎన్నికల ప్రచారానికి ఎంపీ భగవంత్‌మాన్ నేతృత్వం వహిస్తారని కూడా ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఇదిలా ఉండగా హాఫ్‌పోస్ట్-సీ ఓటర్ అనే సంస్థ నిర్వహించిన ఎన్నికల సర్వేలో ఆప్ 94 నుంచి 100 స్థానాల వరకు గెలుచుకునే అవకాశాలున్నాయని ప్రకటించింది. దీంతో అకాలీదళ్-బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకుంది. పంజాబ్‌లో ఆప్ కొత్తగా బరిలోకి దిగడంతో త్రిముఖ పోటీ జరుగనుంది. కాగా నవజోత్‌సింగ్ సిద్ధూ ఆగస్టు 15న ఆప్‌లో చేరనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఆయన ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన విషయం విదితమే. అసెంబ్లీ అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం వల్ల ప్రచారానికి తగిన సమయం లభిస్తుందని ఆప్ నేతలు భావిస్తున్నారు.
Advertisement