ఆ నినాదంపై టీడీపీ స్వీయ నిషేధం

టీడీపీతో కొన్ని నినాదాలకు కవల పిల్లల్లాంటి సంబంధం ఉంది. ఆ నివాదాలకు తామే బ్రాండ్‌ అంబాసిడర్ అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటుంటారు. అలాంటి పదాల్లో ”తెలుగువారి ఆత్మగౌరవం” అన్నది సుప్రసిద్దమైనది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించింది కూడా ఆ నినాదంపైనే. అయితే ఆశ్చర్యం ఏమిటంటే టీడీపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ఈ ఆత్మగౌరవం విధుల్లో విహరిస్తుంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటకు ముందు, మాటకు తర్వాత ప్రతి టీడీపీ నాయకుడు ”తెలుగువారి ఆత్మగౌరవం” అంటూ కేకలు వేసేవారు. ఏపీలో కాంగ్రెస్ […]

Advertisement
Update:2016-08-03 04:33 IST

టీడీపీతో కొన్ని నినాదాలకు కవల పిల్లల్లాంటి సంబంధం ఉంది. ఆ నివాదాలకు తామే బ్రాండ్‌ అంబాసిడర్ అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటుంటారు. అలాంటి పదాల్లో ”తెలుగువారి ఆత్మగౌరవం” అన్నది సుప్రసిద్దమైనది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించింది కూడా ఆ నినాదంపైనే. అయితే ఆశ్చర్యం ఏమిటంటే టీడీపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ఈ ఆత్మగౌరవం విధుల్లో విహరిస్తుంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటకు ముందు, మాటకు తర్వాత ప్రతి టీడీపీ నాయకుడు ”తెలుగువారి ఆత్మగౌరవం” అంటూ కేకలు వేసేవారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉనప్పుడు ఆ పార్టీ సీఎంలు ఢిల్లీ వెళ్తే చాలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేందుకు వెళ్తున్నారంటూ రగిలిపోయేవారు అప్పట్లో తమ్ముళ్లు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా విషయంలో మోసంచేసి తెలుగుజాతిని బట్టలూడదీసి నడిబజారులో నిల్చోబెట్టింది. కానీ ఒక్క టీడీపీ నేత నోటినుంచి గానీ బాబు ఆస్థాన మీడియా సంస్థల్లో గానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలుగువారి ఆత్మగౌరవం- ఢిల్లీలో తాకట్టు అన్న పదం వినిపించడం లేదు.

పైగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని ముఖం మీదే ఢిల్లీ పెద్దలుచెబుతున్నా… చంద్రబాబు మాత్రం తెలుగుజాతి కోసమే నేను ఓర్పుతో ఉన్నానంటూ తెలుగువారి ఆత్మగౌరవాన్నే తాకట్టుపెట్టి కూర్చున్నారు. అయితే ఓటుకు నోటు కుంభకోణం బయటపడగానే చంద్రబాబు ఆత్మగౌరవం కూడా పోయిందనుకోండి!. తన గౌరవమే తెలుగువారి ఆత్మగౌరవం అని భావించే చంద్రబాబు తన గౌరవానికి తాకట్టుగా తెలుగువారి ఆత్మగౌరవం పెట్టేసినట్టుగా ఉన్నారు. బాబు ప్రతిపక్షంలో ఉండగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిత్యం సుప్రభాతం తరహాలో వినిపించిన ఆస్థాన డబ్బాల్లో కూడా రెండేళ్లుగా ఒక్కసారి కూడా ఆత్మగౌరవం అన్న పదం వినిపించకపోవడమే ఆశ్చర్యమే. అంతే మరి చంద్రబాబు మేనేజ్‌మెంట్‌ స్కిల్స్ అలాంటివి. ఆత్మగౌరవం అన్న పదం వినిపించకుండా చేయడమే కాదు… ఆయన తలుచుకుంటే ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటే ఏమొస్తుంది? అమ్ముకుంటే అంతోఇంతో లాభమైనా ఉంటుందని ప్రచారం చేయించగలిగిన దిట్ట. మొత్తం మీద ”తెలుగువారి ఆత్మగౌరవం” అన్న నినాదం తిరిగి టీవీల్లో చూడాలన్నా, టీడీపీ నేతల మాటల్లో వినాలన్న ప్రభుత్వం మారాలి కాబోలు.

Also Read:

డబ్బు కోసం నేను అలా చేయను…

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న స‌మంత‌..!

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News