బాబు అప్పుడు లేకపోవడం అదృష్టం, ఇప్పుడు ఉండడం దురదృష్టం

అరుణ్ జైట్లీ ప్రసంగం చూసిన తర్వాత తన రక్తం మరుగుతోందన్న చంద్రబాబు… హోదా కోసం చేస్తున్న బంద్‌ను అడ్డుకునేందుకు మాత్రం సర్వశక్తులు ఒడ్డారని వైఎస్‌ జగన్ ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు తీరు చూసి జనం రక్తమే మరుగుతోందన్నారు. ఒక పద్దతి ప్రకారం చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. టీడీపీ కేంద్రమంత్రులు కనీసం పార్లమెంట్‌లో నిరసన కూడా తెలపకపోవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. చంద్రబాబు స్వాతంత్య్ర పోరాటంలో లేకపోవడం దేశం చేసుకున్న అదృష్టమన్నారు. చంద్రబాబు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఉండిఉంటే […]

Advertisement
Update:2016-08-02 12:02 IST

అరుణ్ జైట్లీ ప్రసంగం చూసిన తర్వాత తన రక్తం మరుగుతోందన్న చంద్రబాబు… హోదా కోసం చేస్తున్న బంద్‌ను అడ్డుకునేందుకు మాత్రం సర్వశక్తులు ఒడ్డారని వైఎస్‌ జగన్ ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు తీరు చూసి జనం రక్తమే మరుగుతోందన్నారు. ఒక పద్దతి ప్రకారం చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. టీడీపీ కేంద్రమంత్రులు కనీసం పార్లమెంట్‌లో నిరసన కూడా తెలపకపోవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు.

చంద్రబాబు స్వాతంత్య్ర పోరాటంలో లేకపోవడం దేశం చేసుకున్న అదృష్టమన్నారు. చంద్రబాబు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఉండిఉంటే స్వాతంత్య్రం ఏమైనా సంజీవినా అని ఉండేవారని జగన్ అన్నారు. బ్రిటిష్ వాళ్లు ఇచ్చినప్పుడు స్వాతంత్య్రం తీసుకుందామని జనానికి చెప్పేవాడన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం ఇక్కడి ప్రజల దురదృష్టమన్నారు. చంద్రబాబుతో తాను మాట్లాడుతున్నానని అరుణ్ జైట్లీ చెప్పగానే టీడీపీ ఎంపీలు మౌనంగా కూర్చోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ ప్యాకేజ్ గురించి మాట్లాడుతుంటే టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రతిఘటించలేదని నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, మునుముందు కూడా వైసీపీ పోరాటం చేస్తుందన్నారు.

Also Read:

డబ్బు కోసం నేను అలా చేయను…

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి

అది అంత తేలికైన విషయం కాదు..అలియ‌భ‌ట్‌..!

నాకంటే గొప్పొళ్లున్నారు అంటున్న స‌మంత‌..!

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News