కొడుకుపోయి ఆమె ఏడుస్తుంటే...ఆ గవర్నర్ నీతులు చెప్పారు!
కొడుకు హత్యకు గురయి ఏడుస్తున్న మహిళకు రాజకీయ నేతలు…పిల్లలను ఎలా పెంచాలి… అనే విషయంమీద సలహాలు ఇచ్చారు. గత నెల 23న అబేష్ దాస్ గుప్తా(17) కోల్‌కతాలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో హత్యకు గురయ్యాడు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రముఖ రచయిత అమిత్ చౌదరి కుమార్తె పుట్టిన రోజు వేడుకకు వెళ్లిన అబేష్‌ని ఎవరో పగలిన ఆల్కహాల్ బాటిల్తో దారుణంగా పొడిచి చంపారు. అమిత్ చౌదరే అబేష్ని కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అతను మరణించాడు. […]
కొడుకు హత్యకు గురయి ఏడుస్తున్న మహిళకు రాజకీయ నేతలు…పిల్లలను ఎలా పెంచాలి… అనే విషయంమీద సలహాలు ఇచ్చారు. గత నెల 23న అబేష్ దాస్ గుప్తా(17) కోల్‌కతాలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో హత్యకు గురయ్యాడు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రముఖ రచయిత అమిత్ చౌదరి కుమార్తె పుట్టిన రోజు వేడుకకు వెళ్లిన అబేష్‌ని ఎవరో పగలిన ఆల్కహాల్ బాటిల్తో దారుణంగా పొడిచి చంపారు. అమిత్ చౌదరే అబేష్ని కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అతను మరణించాడు. స్నేహితుల మధ్య గొడవల వల్లనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు తొలుత అనుమానించారు. పగిలిన గాజు బాటిల్తో పొడిచి చంపినట్టుగా మొదట కేసు నమోదు చేసిన పోలీసులు తరువాత దీన్ని యాక్సిడెంట్గా చిత్రించే ప్రయత్నం చేశారు.
అబేష్ బాటిల్ పట్టుకుని పార్కింగ్ ప్లేస్లో పైనుండి దూకాడని, ఆ సమయంలో అతని చేతిలో ఉన్న బాటిల్ పగిలి బాహుమూల ప్రాంతంలో గుచ్చుకుని పోయి రక్తం పోవటం వలన మరణించి ఉంటాడని చెప్పారు. దీనిపై స్పందించిన అబేష్ తల్లి రింజిమ్ పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. రింజిమ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం ఈ విషయంపై కలుసుకున్నారు.
అబేష్తో పాటు మరో ఇద్దరు టీనేజర్లకు లిక్కర్ని అమ్మారంటూ… ముగ్గురు వ్యక్తులను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు కానీ, అబేష్ హత్యకు సంబంధించి ఎలాంటి అరెస్టులూ జరగలేదు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సుబ్రతా ముఖర్జీ, గవర్నర్ కేశర్నాథ్ త్రిపాఠి మరికొందరు నేతలు …పిల్లలను సరిగ్గా పెంచలేకపోవటం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయనే వ్యాఖ్యలు చేశారు. అబేష్ హత్య గురించి మాట్లాడుతూ…తల్లిదండ్రుల పెంపకమే అందుకు కారణం అన్నట్టుగా కామెంట్లు చేశారు. గవర్నర్ త్రిపాఠి ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో …పిల్లలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అంతకు ముందు మేయర్ సోవన్ ఛటర్జీ ఫేస్ బుక్లో 12, 13 ఏళ్ల పిల్లలకు నోట్ల కట్టలను ఇచ్చి ఎందుకు పంపుతున్నారు అని ప్రశ్నించారు. ఏడు ఎనిమిది చదివే పిల్లలకు ఖరీదైన మొబైల్ ఫోన్లు ఉంటున్నాయని, వారు అర్థరాత్రి వరకు గర్ల్ ఫ్రెండ్‌తో చాటింగ్లు చేస్తున్నారంటూ పోస్ట్ పెట్టారు. ఇక మంత్రి సుబ్రతా ముఖర్జీ…అబేష్ మృతితో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని, వారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు…డబ్బుని ఎలా ఖర్చుపెడుతున్నారు అనేది తెలుసుకోవాలని అన్నారు.
దీనిపై స్పందించిన రింజిమ్ వారు చెబుతున్నవన్నీ… తనకు తన కుమారుడికి వర్తించవని అంటున్నారు. పైగా అబేష్ మృతిపై విచారణ జరుగుతున్న సందర్భంలో ఇలా మాట్లాడటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు అబేష్ కేసు విషయంలో జరుగుతున్న దర్యాప్తుని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. తాను తన కుమారుడిని సరిగ్గానే పెంచానని చెబుతూ….అబేష్ శరీరంమీద పగిలిన బాటిల్తో పొడిచిన గాయాలు ఉన్నాయని, అవేలా వచ్చాయో విచారణ జరిపించాలని రింజిమ్ డిమాండ్ చేస్తున్నారు.
తమ గురించి ఏమీ తెలియకుండానే కామెంట్ చేస్తున్నారని, వాళ్లు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటే….ఇలాగే కామెంట్లు చేసేవారా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇది…లైంగిక వేధింపులు భరిస్తూ కేసు పెట్టడానికి వచ్చిన మహిళపైనే నిందలు వేయటంలా ఉందని, దోషులను వదిలేసి బాధితులను ప్రశ్నిస్తున్నట్టుగా ఉందని ఆమె అన్నారు.