వైసీపీతో కలిసి పనిచేసే ఆలోచన ఉంది " మాజీ ఎంపీ

తెలుగు ప్రజలతో తాము ఆడిన ఆట ఫలితాన్ని అనుభవించేసరికి కాంగ్రెస్‌కు మైకం వదిలినట్టుగా ఉంది. సోనియా గాంధీని చూసే వైఎస్‌ను ప్రజలు గెలిపించారంటూ బీరాలు పలికిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్తరాగం అందుకుంది. ఏపీలో అడ్రస్‌ గల్లంతయ్యే సరికి నేల మీదకు వచ్చింది. మాజీ ఎంపీ, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అదే తరహాలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే యోచనలో కాంగ్రెస్ ఉందని సంజీవరెడ్డి చెప్పారు. అలా చేస్తే […]

Advertisement
Update:2016-08-01 09:15 IST

తెలుగు ప్రజలతో తాము ఆడిన ఆట ఫలితాన్ని అనుభవించేసరికి కాంగ్రెస్‌కు మైకం వదిలినట్టుగా ఉంది. సోనియా గాంధీని చూసే వైఎస్‌ను ప్రజలు గెలిపించారంటూ బీరాలు పలికిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్తరాగం అందుకుంది. ఏపీలో అడ్రస్‌ గల్లంతయ్యే సరికి నేల మీదకు వచ్చింది. మాజీ ఎంపీ, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అదే తరహాలో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే యోచనలో కాంగ్రెస్ ఉందని సంజీవరెడ్డి చెప్పారు. అలా చేస్తే రెండు రాష్ట్రాల్లోనూ గెలుపు ఖాయమన్నారు. వైసీపీతో కలిసి పనిచేసే పరిస్థితి రావాలని తాను కూడా కోరుకుంటున్నానని సంజీవరెడ్డి చెప్పారు. వైసీపీతో కలిసి పనిచేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ తిరిగి కోలుకోవాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోకతప్పదన్నారు. అయితే వైసీపీతో చర్చల అంశంపై పూర్తి స్థాయిలో స్పందించలేనని కూడా మాజీ ఎంపీ సంజీవరెడ్డి చెప్పారు. ఒక విధంగా సంజీవరెడ్డి చెప్పింది వాస్తవమే. వైసీపీతో పొత్తుపెట్టుకుంటే కాంగ్రెస్‌ కోలుకునే చాన్స్ ఉంటుంది. అయితే వైసీపీ మాత్రం తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ముఖ్యంగా ఏపీలో.

సంజీవరెడ్డి వ్యాఖ్యలను కొందరు కాంగ్రెస్ నాయకులు ఆహ్వానిస్తున్నారు. వి. హనుమంతరావులాంటి పార్టీకి భారమైన నాయకుల వల్లే, వాళ్ల చెప్పుడు మాటలవల్లే కాంగ్రెస్ దెబ్బతినిందని అంటున్నారు. అలాగే ఎప్పుడూ అత్యున్నత పదవులను అనుభవిస్తూ సొంత పార్టీ ప్రయోజనం కన్నా స్వప్రయోజనం కోసం తాపత్రయపడుతూ లోపాయికారీగా ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యే చిదంబరంలాంటి నాయకుల వల్లే కాంగ్రెస్ కు ఈ గతిపట్టిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందువల్లే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయిందని సర్ధిచెప్పుకునే వాళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు నాశనం అయిందో చెప్పగలరా? అని నిలదీస్తున్నారు. భారత సమాజం గురించి కనీస అవగాహనలేని సోనియాగాంధీ చెప్పుడు మాటలు విని తన పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన రాజశేఖర రెడ్డినే దోషినిచేసి, అవినీతిపరుడిగా చిత్రించడానికి అవకాశమిచ్చిన కాంగ్రెస్ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు క్షమించలేదని అందువల్లే కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించారని అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు వైసీపీతో కలిసినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ ను ఇప్పుడప్పుడే క్షమించరని భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News