ఇంగ్లీష్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టే దమ్ముందా బాబు..?

ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని రాజ్యసభలో అరుణ్‌జైట్లీ చెప్పిన తరువాత కూడా కేంద్రప్రభుత్వానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేయకపోవడంపై ప్రతిపక్షనేత వైఎస్‌.జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా సంజీవిని కాదని చంద్రబాబు అనడంవల్లే కేంద్రప్రభుత్వం ఈరోజు ఇలా వ్యవహరిస్తోందని జగన్‌ విమర్శించారు. కోట్ల రూపాయల నల్లధనాన్ని తెలంగాణలో ఎమ్మెల్యేలను కోనేందుకు లంచంగా ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయిన తరువాతే చంద్రబాబు ప్రత్యేకహోదాపై ప్లేటు పిరాయించారని ఆరోపించారు. ప్రత్యేకహోదా అయిదేళ్లు కాదు, పదిహేనేళ్లు ఇవ్వాలని ఎన్నికల […]

Advertisement
Update:2016-07-30 08:16 IST

ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని రాజ్యసభలో అరుణ్‌జైట్లీ చెప్పిన తరువాత కూడా కేంద్రప్రభుత్వానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేయకపోవడంపై ప్రతిపక్షనేత వైఎస్‌.జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా సంజీవిని కాదని చంద్రబాబు అనడంవల్లే కేంద్రప్రభుత్వం ఈరోజు ఇలా వ్యవహరిస్తోందని జగన్‌ విమర్శించారు.

కోట్ల రూపాయల నల్లధనాన్ని తెలంగాణలో ఎమ్మెల్యేలను కోనేందుకు లంచంగా ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయిన తరువాతే చంద్రబాబు ప్రత్యేకహోదాపై ప్లేటు పిరాయించారని ఆరోపించారు.

ప్రత్యేకహోదా అయిదేళ్లు కాదు, పదిహేనేళ్లు ఇవ్వాలని ఎన్నికల సమయంలో కోరిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఏమీ ఒరిగేదిలేదని చెప్పేస్తాయికి దిగజారారని జగన్‌ మండిపడ్డాడు. చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం రాష్ట్రాన్నే పణంగా పెట్టారని అన్నారు. ఇంత జరిగిన తరువాత కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి తాము బీజేపితోనే ఉంటామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తుంటే పక్క రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని వెంకయ్యనాయుడు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

చంద్రబాబు తన అనుభవాన్ని మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు ఉపయోగిస్తున్నారని జగన్‌ విమర్శించారు. చిన్నపిల్లలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా ప్రతిఒక్కరినీ చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు రూ. 1,34,000 కోట్ల అవినీతి చేశారన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా ఏపీ అవినీతిలో నెంబర్‌ 1 స్థానంలో ఉన్నట్టు నిర్ధారించిన అంశాన్ని కూడా జగన్‌ ప్రస్తావించాడు. ఒక పథకం ప్రకారమే ఏపీని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.

మోదీ అంటే చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. అందుకే ఇంగ్లీష్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టే దైర్యంకూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని అన్నారు. ఇంగ్లీష్‌లో ప్రెస్‌మీట్‌ పెడితే మోదీకి అర్ధమవుతుందన్న భయంతోనే చంద్రబాబు కనీసం ఇంగ్లీష్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగానే ఆగష్టు 2న ఏపీ బందుకు పిలుపునిచ్చామని దాన్ని ప్రతిఒక్కరూ విజయవంతం చేయాలని జగన్‌ కోరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News