"ఆ ఒక్క మాట" చాలు బాబు వల్ల ఏమీ కాదని చెప్పేందుకు?

ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చిచెప్పిన తర్వాత చంద్రబాబు మాట్లాడిన తీరు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. చంద్రబాబు అనుకూల మీడియా బాబును కాపాడేందుకు చాలా జాగ్రత్తగానే కథనాలు వడ్డించింది. అరుణ్‌ జైట్లీ ప్రకటన తర్వాత వెంటనే ఢిల్లీలోని టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారట. ఎంపీల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారని అనుకూల పత్రికల్లో కథనం. అరుణ్‌ జైట్లీ ప్రకటనకు నిరసనగా సభను ఎందుకు స్తంభింపచేయలేదని ఎంపీలపై ఆగ్రహించారట బాబు. అంటే ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు […]

Advertisement
Update:2016-07-30 03:22 IST

ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చిచెప్పిన తర్వాత చంద్రబాబు మాట్లాడిన తీరు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. చంద్రబాబు అనుకూల మీడియా బాబును కాపాడేందుకు చాలా జాగ్రత్తగానే కథనాలు వడ్డించింది. అరుణ్‌ జైట్లీ ప్రకటన తర్వాత వెంటనే ఢిల్లీలోని టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారట. ఎంపీల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారని అనుకూల పత్రికల్లో కథనం. అరుణ్‌ జైట్లీ ప్రకటనకు నిరసనగా సభను ఎందుకు స్తంభింపచేయలేదని ఎంపీలపై ఆగ్రహించారట బాబు. అంటే ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని జనాన్ని నమ్మించడం ఆ పత్రికల తాపత్రయం. అయితే ఇక్కడే సదరు పత్రికలు బాబు డొల్లతనాన్ని కూడా తెలిసోతెలియకో బహిర్గతం చేశాయి.

”పొమ్మంటే కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా నిరభ్యంతరంగా బయటకు వచ్చేద్దాం , రాజీపడే ప్రసక్తే లేదు” అని ఎంపీలతో చంద్రబాబు అన్నారని పత్రికల కథనం . అయినా కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావడానికి ప్రత్యేక హోదాసాధ్యం కాదని చెప్పడం సరిపోదా?. ముఖం మీద ఉమ్మేసి… ఛీ బయటకు వెళ్లిపోండి అంటేనే బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటుందా?. అయినా బయటకు వెళ్లండి అని బీజేపీ వాళ్లు ఎందుకంటారు?. కేంద్రంనుంచి సాయం అందినా అందకపోయినా ఢిల్లీ వెళ్లి ఒంగిఒంగి సలామ్‌ కొడుతున్న వారిని బీజేపీ పెద్దలు ఎందుకు దూరం చేసుకుంటారు?. ఇప్పుడు బంతి చంద్రబాబు కోర్టులోనే ఉంది. ఆ విషయం ఆయనకూ తెలుసు. ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చెప్పింది కాబట్టి బీజేపీతో కలిసి ఉండాలా బయటకు రావాలా అన్నది నిర్ణయించుకోవాల్సింది చంద్రబాబు. అంతే కానీ పట్టపగలే విశాలమైన మైదానంలో తాను మాత్రమే కళ్లుమూసుకుని దాగుడుమూతలు ఆడితే నమ్మేందుకు ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదు. పైగా ”ప్రజల కోసమే తాను ఓపిగ్గా ఉన్నాను”, ”నా రక్తం మరుగుతోంది” అంటూ చంద్రబాబు డైలాగులు చెప్పడం” నేను లేస్తే మనిషిని కాదు” అన్నట్టుగా ఉంది. శుక్రవారం రాత్రి 9గంటలకు పెట్టిన ప్రెస్ మీట్ లో బీజేపీని వదిలేసి కాంగ్రెస్, వైసీపీని తిట్టినప్పుడే బాబుగారి ధీరత్వం అందరికీ తెలిసిపోయింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News