తేల్చేసిన జైట్లీ...ఇప్పుడు బాబు ఏం చేస్తారో?
ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని మరోసారి కేంద్రం తేల్చేసింది. ప్రత్యేకహోదా వీలుకాదని పరోక్షంగా అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటే నిబంధనలు అడ్డువస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ఏపీకి అనేక రాయితీలు ఇచ్చామని రాజ్యసభలో జైట్లీ చెప్పారు. ఏపీకి ఇంకా సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అయితే నిధుల కేటాయింపులో కాలపరిమితి లేదని చెప్పారు. ప్రత్యేకహోదాపై అప్పటి ప్రధాని చేసింది కేవలం ప్రకటన మాత్రమేనన్నారు. హోదా అంశం చట్టంలో లేదని అన్నారు. హోదాపై రాజకీయాలు మానుకోవాలని […]
ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని మరోసారి కేంద్రం తేల్చేసింది. ప్రత్యేకహోదా వీలుకాదని పరోక్షంగా అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటే నిబంధనలు అడ్డువస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ఏపీకి అనేక రాయితీలు ఇచ్చామని రాజ్యసభలో జైట్లీ చెప్పారు. ఏపీకి ఇంకా సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అయితే నిధుల కేటాయింపులో కాలపరిమితి లేదని చెప్పారు. ప్రత్యేకహోదాపై అప్పటి ప్రధాని చేసింది కేవలం ప్రకటన మాత్రమేనన్నారు. హోదా అంశం చట్టంలో లేదని అన్నారు. హోదాపై రాజకీయాలు మానుకోవాలని కోరారు. మిత్రపక్షం ఏపీలో అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రత్యేకంగా సాయం చేయడం వీలుకాదని జైట్లీ చెప్పారు.
సరిహద్దులో ఉండటంతో ఈశాన్య రాష్ట్రాలకు హోదా ఇచ్చామని, హోదా ఇస్తే 90 శాతం నిధులు కేంద్రమే భరించాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. జైట్లీ ప్రసంగం మొత్తం పరిశీలిస్తే ప్రత్యేక హోదా మాత్రం అడగవద్దు అన్నట్టుగా సాగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చూడాలి. ఎప్పటిలాగే ఒత్తిడితెస్తామంటూ ఒత్తిడి నుంచి బయటపడుతారా లేక అల్టిమేటం ఇచ్చి కేంద్రం నుంచి బయటకొస్తారా?. చంద్రబాబు గురించి తెలిసిన వారుఎవరైనా రెండోది జరుగుతుందని ఆశించడం ఆత్యాశే.
Click on Image to Read: