స‌ల్మాన్ జింక‌ను కాల్చాడు..గొంతుకూడా కోశాడు!

రాజ‌స్థాన్ హైకోర్టు కృష్ణ‌జింక‌ల వేట కేసులో స‌ల్మాన్ ఖాన్ నిర్దోషి అని ప్ర‌క‌టించినా…స‌ల్మాన్ ఆ కేసు నుండి పూర్తిగా బ‌య‌ట‌ప‌డే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. స‌ల్మాన్ జింక‌ల‌ను వేటాడిన స‌మయంలో ఆయ‌న జీపుని న‌డుపుతున్న డ్రైవ‌ర్ హ‌రీష్ దులానీ మ‌రోసారి నోరువిప్పాడు. ఎన్డీటివికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హ‌రీష్, స‌ల్మాన్ జింక‌ను తుపాకితో కాల్పి చంప‌టం వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నాడు. జింక‌ను కాల్చ‌డ‌మే కాదు, ఆ త‌రువాత అత‌ను దాని మెడ‌ను కోశాడ‌ని హ‌రీష్ వెల్ల‌డించాడు. త‌మ  కుటుంబానికి బెదిరింపులు […]

Advertisement
Update:2016-07-28 06:35 IST

రాజ‌స్థాన్ హైకోర్టు కృష్ణ‌జింక‌ల వేట కేసులో స‌ల్మాన్ ఖాన్ నిర్దోషి అని ప్ర‌క‌టించినా…స‌ల్మాన్ ఆ కేసు నుండి పూర్తిగా బ‌య‌ట‌ప‌డే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. స‌ల్మాన్ జింక‌ల‌ను వేటాడిన స‌మయంలో ఆయ‌న జీపుని న‌డుపుతున్న డ్రైవ‌ర్ హ‌రీష్ దులానీ మ‌రోసారి నోరువిప్పాడు. ఎన్డీటివికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హ‌రీష్, స‌ల్మాన్ జింక‌ను తుపాకితో కాల్పి చంప‌టం వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నాడు. జింక‌ను కాల్చ‌డ‌మే కాదు, ఆ త‌రువాత అత‌ను దాని మెడ‌ను కోశాడ‌ని హ‌రీష్ వెల్ల‌డించాడు. త‌మ కుటుంబానికి బెదిరింపులు రావ‌టం వ‌ల్ల‌నే ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయామ‌ని, త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తే ఎక్క‌డైనా సాక్ష్యం చెప్పేందుకు తాను సిద్ధ‌మేన‌ని అత‌ను తెలిపాడు. హ‌రీష్ 2002 నుండి క‌నిపించ‌కుండా పోయాడు. ఇత‌ను ఈ కేసులో ఏకైక సాక్షి. 1998లో స‌ల్మాన్ ఒక కృష్ణ‌జింక‌, ఒక సాధార‌ణ జింక‌ల‌ను కాల్చి చంపిన‌ట్టుగా కేసు న‌మోదు కాగా, ఆ కేసులో అత‌ను నిర్దోషి అని రాజ‌స్థాన్ కోర్టు ఇటీవ‌ల తీర్పు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News