కేంద్రం బండారం బయటపెడతానంటున్న కేంద్ర మంత్రి

బీజేపీకి టీడీపీ మిత్రపక్షం. ఇది అందరికీ తెలుసు. కానీ మంచికి మాత్రమే మేం భాగస్వాములం, చెడుకు మాత్రం బాధ్యతంతా బీజేపీదే అన్నట్టుగా తయారైంది టీడీపీ తీరు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి సుజనా చౌదరి మాటలు వింటుంటే అలాగే ఉంది. కేంద్రమంత్రిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచిచెడుల్లో భాగస్వామి అయి ఉండి కూడా తనకేం తెలియదన్నట్టుగా మాట్టాడారు. రెండేళ్లుగా ఏపీకి కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను […]

Advertisement
Update:2016-07-27 06:31 IST

బీజేపీకి టీడీపీ మిత్రపక్షం. ఇది అందరికీ తెలుసు. కానీ మంచికి మాత్రమే మేం భాగస్వాములం, చెడుకు మాత్రం బాధ్యతంతా బీజేపీదే అన్నట్టుగా తయారైంది టీడీపీ తీరు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి సుజనా చౌదరి మాటలు వింటుంటే అలాగే ఉంది. కేంద్రమంత్రిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచిచెడుల్లో భాగస్వామి అయి ఉండి కూడా తనకేం తెలియదన్నట్టుగా మాట్టాడారు. రెండేళ్లుగా ఏపీకి కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మిత్రధర్మం పాటిస్తుందో లేతో బీజేపీ చెప్పాలన్నారు. రెండేళ్లలో కేంద్రం ఏం ఇచ్చిందో బ్యాలెన్స్ షీట్ విడుదల చేస్తామని దానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. కేంద్రం తీరుపై అసంతృప్తి ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుంది గానీ… కేంద్రంలో మంత్రిగానే ఉంటూ అక్కడ ఏం సాధించలేకపోయినా పదవి పట్టుకుని వేలాడుతూ మరో పక్క మాత్రం భీరాలు పలకడం టీడీపీ నేతలకే చెల్లింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News