హరీశ్ జపాన్ పర్యటన రద్దు అందుకేనా?
భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు విదేశీ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. షెడ్యూలు ప్రకారం.. మంత్రి హరీశ్‌రావుతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నీటిపారుదల నిపుణులతో కలిసి ఈరోజు (సోమవారం) తొలుత జపాన్, తరువాత అటు నుంచి ఆస్ర్టియా వెళ్లాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పైపులు జపాన్‌లో రూపొందుతున్నాయి. అలాగే ఆస్ట్రియాలో రూపొందుతున్న ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన పైపులను కూడా వీరు పరిశీలించాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆయన […]
Advertisement
భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు విదేశీ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. షెడ్యూలు ప్రకారం.. మంత్రి హరీశ్‌రావుతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నీటిపారుదల నిపుణులతో కలిసి ఈరోజు (సోమవారం) తొలుత జపాన్, తరువాత అటు నుంచి ఆస్ర్టియా వెళ్లాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పైపులు జపాన్‌లో రూపొందుతున్నాయి. అలాగే ఆస్ట్రియాలో రూపొందుతున్న ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన పైపులను కూడా వీరు పరిశీలించాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆయన తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. మంత్రి హరీశ్‌రావు మాత్రం పర్యటనకు వెళ్లకుండా ఆగిపోయారు. మిగిలిన అధికారుల బృందం పైపుల తయారీని పరిశీలించి వస్తారు.
హరీశ్‌రావు తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడానికి కారణం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళనే అని అంటున్నారు. గతకొంతకాలంగా మల్లన్న సాగర్‌కు తమ భూమి ఇచ్చేది లేదని 14 గ్రామాల ప్రజలు దాదాపుగా 3 నెలలుగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. వీరి ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో హరీశ్ రంగంలోకి దిగారు. ఇటీవల హరీశ్ జరిపిన చర్చలు సఫలం కావడంతో లక్ష్మాపూర్ , ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రజలు మనసు మార్చుకుని తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో సగం సమస్య సమసిపోయిందనే భావించారు. కానీ, అకస్మాత్తుగా ఆదివారం మల్లన్న సాగర్‌కు వ్యతిరేకంగా ఎర్రవల్లి, పల్లెపహాడ్ గ్రామాల ప్రజలు రాజీవ్ రహదారి దిగ్బంధనానికి ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడం, ఆందోళనకారులు వారిపై రాళ్లు విసరడం, పోలీసులు లాఠీఛార్జి జరిపడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడం తీవ్ర కలకలానికి దారి తీసింది. దీనికి నిరసనగా విపక్షాలు నేడు మెదక్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. పరిస్థితిని సమీక్షించుకునేందుకే హరీశ్.. తన విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారని సమాచారం.
Advertisement