యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురు చిన్నారుల దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహిలో ఘోర ప్రమాదం జరిగింది. కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూలు బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులందరినీ.. ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 19 మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. వేగంగా వస్తోన్న రైలు స్కూలు బస్సును ఢీకొట్టడంతో బస్సు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో బస్సు దూరంగా ఎగిరి […]
Advertisement
ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహిలో ఘోర ప్రమాదం జరిగింది. కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూలు బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులందరినీ.. ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 19 మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. వేగంగా వస్తోన్న రైలు స్కూలు బస్సును ఢీకొట్టడంతో బస్సు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో బస్సు దూరంగా ఎగిరి పడింది. చిన్నారుల స్కూలు బ్యాగులు, పుస్తకాలు, టిఫిన్ బాక్సులు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ ప్రాంతమంతా చిన్నారుల రక్తంతో తడిసిపోయింది. వారి ఆర్తనాదాలతో సంఘటనా స్థలం భీతావహంగా మారింది. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
2014లో జూన్ 23న మెదక్‌జిల్లా మాసాయిపేట దుర్ఘటనలోనూ ఇలాగే జరిగింది. కాపలాలేని లెవెల్‌క్రాసింగ్ వద్ద రైలు స్కూలు బస్సును ఢీకొట్టడంతో మొత్తం 18 మంది చిన్నారులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే! మరో 18 మంది గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కాపలాలేని రైల్వే క్రాసింగ్ ల గురించి తీవ్ర చర్చకు దారి తీసింది. అప్పుడుచర్యలు తీసుకుంటామన్న కేంద్రం తరువాత ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. అందుకు తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న భదోహీ ప్రమాదమే నిదర్శనం.
Advertisement