పోనీలే వదినా...దేవుడున్నాడు..."మా కర్మరా బాబు!"

ఏపీ జనం వెర్రివాళ్లన్న నమ్మకం నారావారి కుటుంబంలో బాగా పాతుకుపోయినట్టు ఉంది. అదే సమయంలో తెలంగాణ జనం తామేమి చెప్పినా తలూపే రేవంత్‌ రెడ్డి లాంటి వారే అనుకుంటున్నారు కాబోలు. ఏలుతున్న ఏపీ అవినీతిలో అధికారికంగా నెంబర్ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. పొద్దునే లేస్తే పడుకునే వరకు చంద్రబాబు రుణమాఫీ మోసాన్ని తలుచుకుంటూ రైతులు, డ్వాక్రా మహిళలు కాలం వెల్లదీస్తున్నారు. రైతులకు చిల్లర విదిల్చిన చంద్రబాబు.. డ్వాక్రా మహిళలకు నయా పైసా కూడా మాఫీ కింద […]

Advertisement
Update:2016-07-24 06:53 IST

ఏపీ జనం వెర్రివాళ్లన్న నమ్మకం నారావారి కుటుంబంలో బాగా పాతుకుపోయినట్టు ఉంది. అదే సమయంలో తెలంగాణ జనం తామేమి చెప్పినా తలూపే రేవంత్‌ రెడ్డి లాంటి వారే అనుకుంటున్నారు కాబోలు. ఏలుతున్న ఏపీ అవినీతిలో అధికారికంగా నెంబర్ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. పొద్దునే లేస్తే పడుకునే వరకు చంద్రబాబు రుణమాఫీ మోసాన్ని తలుచుకుంటూ రైతులు, డ్వాక్రా మహిళలు కాలం వెల్లదీస్తున్నారు. రైతులకు చిల్లర విదిల్చిన చంద్రబాబు.. డ్వాక్రా మహిళలకు నయా పైసా కూడా మాఫీ కింద ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సాయంకాలం జరిగే డ్వాక్రా మహిళల సమావేశాల దగ్గరకు వెళ్తే ఈ మధ్య అరుపులు తిట్లు వినిపిస్తున్నాయి. అందులో సగం శాపనార్థలే. రుణమాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసానికి మహిళల నుంచి వస్తున్న ఆక్రోశమే ఆ అరుపులు.

డ్వాక్రా గ్రూప్ సమావేశానికి శాంతంగావెళ్లిన ఆడాళ్లు అక్కడికి వెళ్లిన తర్వాత చంద్రబాబు మోసాన్ని తలుచుకుని “పోనీలే వదినా… కానీలే అక్కా… ఏం చేస్తాం… దేవుడున్నాడు ” అంటూ ఒకరికొకరు ఓదార్చుకుంటున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి కోపాన్ని తగ్గించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఏపీలో ఇంత దరిద్రం పెట్టుకుని అక్కడ ఉద్దరించడం మానేసి ఇప్పుడు నారా చినబాబు తెలంగాణ రైతులను ఉద్దరిస్తారట. శనివారం టీటీడీపీ నేతలతో సమావేశమైన నారా లోకేష్ … ప్రెస్‌మీట్లు మాని ప్రజల్లోకి వెళ్లండని టీటీడీపీ సీనియర్‌ నేతలకు ఆదేశించారు. రుణమాఫీలో ప్రభుత్వం విఫలమైందని దానిపై పోరాటం ఉధృతం చేయాలని హితభోద చేశారు. వచ్చే 15 రోజుల్లో రుణమాఫీ అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తారట. నెలాఖరుకు అన్ని బ్యాంకుల ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. లోకేష్ ఆదేశాలను విన్న మోస్ట్ సీనియర్‌ లీడర్‌ బయటకు వచ్చాక… ముందు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను సరిగా పాలించమనండి అంటూ సన్నిహితుల వద్ద సెటైర్లు వేశారట.

రుణమాఫీ అంశంపై తెలంగాణలో తిరుగుతాం సరే… జనం ఎదురొచ్చి ఏపీలో రైతు, డ్వాక్రా రుణమాఫీ చేశారా? అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో కూడా లోకేష్‌ వివరించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారట. తామంతా రాజకీయం తెలియని వారిమైనట్టు లోకేష్ ఒక్కడే వందేళ్ల రాజకీయ అనుభవం ఉన్నట్టు సలహా ఇవ్వడం, తాము వినాల్సి రావడం అంతా మా కర్మరా బాబూ అని వాపోయారట. ఇంతబతుకు బతికి చివరకు పిల్లాడి వద్ద కోచింగ్ తీసుకోవాల్సి వస్తోందంటూ కారెక్కి వెళ్లిపోయారట. ఎప్పుడో ఆరు నెలలకోసారి లోకేష్ తో జరిగే భేటీకే తెలంగాణ లీడర్లు ఇంతగా ఫీలైపోతే… మరి వారంవారం ప్రొగ్రెస్ కార్డులు, సర్వే పేరుతో జరుగుతున్న వేధింపులకు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతబాధపడుతుండాలి!.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News