నేను పార్టీ వీడుతానని జగన్ ఎప్పుడో కనిపెట్టారు...
ఫిరాయింపు నేతలు అపరిచితుడితో పోటీ పడుతున్నారు. ఒకపార్టీలో ఒకప్పుడు ఒకలా మాట్లాడి… కొత్త కండువా మెడలో పడగానే మరోలా మాట్లాడుతున్నారు. తాజాగా టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మనసులో మాట చెప్పారు. తాను వైసీపీలో ఎక్కువకాలం ఉండనని జగన్ ఎప్పుడో గుర్తించేశారని చెప్పారు. అందుకే పార్టీ నేతల వద్ద ఈయన మన పార్టీలో ఉండడు అని జగన్ చెప్పేవారని అప్పారావు వెల్లడించారు. దురదృష్టవశాత్తు టీడీపీని వదిలిపెట్టి పోయానని, అభిమానంగా చూసే చంద్రబాబును వదిలి పార్టీ మారడం […]
ఫిరాయింపు నేతలు అపరిచితుడితో పోటీ పడుతున్నారు. ఒకపార్టీలో ఒకప్పుడు ఒకలా మాట్లాడి… కొత్త కండువా మెడలో పడగానే మరోలా మాట్లాడుతున్నారు. తాజాగా టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మనసులో మాట చెప్పారు. తాను వైసీపీలో ఎక్కువకాలం ఉండనని జగన్ ఎప్పుడో గుర్తించేశారని చెప్పారు. అందుకే పార్టీ నేతల వద్ద ఈయన మన పార్టీలో ఉండడు అని జగన్ చెప్పేవారని అప్పారావు వెల్లడించారు. దురదృష్టవశాత్తు టీడీపీని వదిలిపెట్టి పోయానని, అభిమానంగా చూసే చంద్రబాబును వదిలి పార్టీ మారడం తన భార్యకు కూడా నచ్చలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ అప్పారావు పార్టీ మారినా ఆయన భార్య వీరరాఘవమ్మ మనసంతా టీడీపీపైనే ఉందని చెప్పారు.
నిజానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు అప్పారావు ప్రయత్నించారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుంచి ప్రతిఘటన రావడంతో ఆలస్యమైంది. ఒక వైపు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే రాజమండి సిటీ వైసీపీ కో ఆర్డినేటర్ పదవిని తన కొడుక్కు ఇప్పించుకునేందుకు అప్పారావు పావులు కదిపారు. కానీ అప్పారావు తీరును అప్పటికే పసిగట్టిన జగన్ ఆ చాన్స్ ఇవ్వలేదని చెబుతున్నారు. రాజమండ్రి సిటీ సమన్వయకర్తగా రౌతు సూర్యప్రకాశ్‌రావును నియమించారు. ఇది జరిగిన తర్వాతే వైసీపీలో తన ఆటలు సాగవన్న నిర్ధారణకు ఆదిరెడ్డి అప్పారావు వచ్చారని సమాచారం.
Click on Image to Read: