వైసీపీలో చేరితే ఇంతేనా? మాజీఎమ్మెల్యే అరెస్ట్
మే నెలలో వైసీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో భార్యను వేధించిన కేసులో సహకరించడం లేదంటూ ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో గతంలోనే మురళీకృష్ణకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ విచారణకు హాజరుకాకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వైసీపీలో చేరిన వెంటనే మురళీకృష్ణపై కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. భూ వివాదానికి […]
మే నెలలో వైసీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో భార్యను వేధించిన కేసులో సహకరించడం లేదంటూ ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో గతంలోనే మురళీకృష్ణకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ విచారణకు హాజరుకాకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
వైసీపీలో చేరిన వెంటనే మురళీకృష్ణపై కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. భూ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిని నిర్భంధించి, బెదిరిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు.అయితే తాను వైసీపీలో చేరడం వల్లే కక్షసాధింపుగా ప్రభుత్వం ఇలా చేస్తోందని మురళీకృష్ణ వాదన.
Click on Image to Read: