విశాఖలో జగన్‌ను అవమానించారా?

రెండేళ్లుగా అధికార పార్టీ వద్ద మార్కులు కొట్టేసేందుకు కొందరు అధికారులు చూపుతున్న అత్యుత్సాహం పదేపదే వివాదాస్పదమవుతోంది. తాజాగా విశాఖ జిల్లాలో ప్రతిపక్ష నేత జగన్ రెండు రోజుల పర్యటనలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కేబినెట్ హోదా ఉండే ప్రతిపక్ష నేతను అధికారులు అడుగడుగున అవమానించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పర్యటనకు వచ్చిన జగన్ సోమవారం రాత్రి నగరంలోని సర్క్యూట్‌ గెస్ట్ హౌజ్‌లో బస చేశారు. సాధారణంగా ప్రతిపక్ష నేతకు గట్టి భద్రతే కల్పిస్తారు. కానీ గెస్ట్ […]

Advertisement
Update:2016-07-20 04:51 IST

రెండేళ్లుగా అధికార పార్టీ వద్ద మార్కులు కొట్టేసేందుకు కొందరు అధికారులు చూపుతున్న అత్యుత్సాహం పదేపదే వివాదాస్పదమవుతోంది. తాజాగా విశాఖ జిల్లాలో ప్రతిపక్ష నేత జగన్ రెండు రోజుల పర్యటనలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కేబినెట్ హోదా ఉండే ప్రతిపక్ష నేతను అధికారులు అడుగడుగున అవమానించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పర్యటనకు వచ్చిన జగన్ సోమవారం రాత్రి నగరంలోని సర్క్యూట్‌ గెస్ట్ హౌజ్‌లో బస చేశారు.

సాధారణంగా ప్రతిపక్ష నేతకు గట్టి భద్రతే కల్పిస్తారు. కానీ గెస్ట్ హౌజ్‌ దగ్గర కేవలం ఒకేఒక్క ఏఆర్‌ కానిస్టేబుల్‌ను కాపలాగా పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు స్థానిక డీఆర్వో, తహసీల్దార్ వచ్చి మర్యాదపూర్వకంగా కలవాల్సి ఉంటుంది. కేబినెట్ హోదా ఉన్న వ్యక్తికి అవసరమైన సౌకర్యాలను తహశీల్దారే పర్యవేక్షించాలి. కానీ జగన్ రాగానే తహసీల్దార్ సుధాకర్ నాయుడు … గ్రామాల పర్యటనకు వెళ్లిపోయారు. డీఆర్వో సుధాకర్ రెడ్డి సరిగ్గా జగన్ పర్యటనకు ముందు రెండు రోజులు సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో జగన్‌ ప్రోటోకాల్‌ పర్యవేక్షణ గాలికి వదిలేశారు.

ప్రతిపక్ష నేత జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగమే వాహనాన్ని సమకూరుస్తుంది. కానీ విశాఖ జిల్లా అధికారులు మాత్రం కండిషన్‌లో లేని ఒక డొక్కు వాహనాన్ని జగన్‌కు ఇచ్చారు. అందులో ఏసీ లేదు, అయినప్పటికీ జగన్ దానిలో వెళ్లేందుకు సిద్ధపడగా కాస్త దూరం వెళ్లి ఆగిపోయింది. దీంతో జగన్ ప్రైవేట్ వాహనంలో వెళ్లిపోయారు. విషయం తెలిసి సాయంత్రానికి కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రకాశరావు మరో వాహనాన్ని పంపారు.

గెస్ట్‌ హౌజ్ వద్ద ఒక కానిస్టేబుల్‌ను భద్రతకు కేటాయించడం, డొక్కు వాహనాన్ని పర్యటనకు కేటాయించడం, తహశీల్దార్ ప్రోటోకాల్‌ నిర్వాహణను గాలికొదిలేసి పర్యటనకు వెళ్లిపోవడం, డీఆర్వో సెలవు పెట్టి వెళ్లడం ఇవన్నీ కావాలనే జగన్‌ను అవమానించేందుకు చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరిగిందంటున్నారు. తహసీల్దార్‌ సుధాకర్‌నాయుడు టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News