శ్రీకాంత్ సినిమాకు టైటిల్ మారింది
పొలీస్ డిపార్ట్ మెంట్ గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో ఇక చేసేదేమీ లేక మెంటల్ పొలీస్ టైటిల్ ని ”మెంటల్ ” గా ఫిక్స్ చేసారు దర్శక నిర్మాతలు. సినిమా పేరులోంచి పోలీస్ అనే పదాన్ని తొలిగించారు. సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రం ”మెంటల్ పొలీస్” . ఈ పేరు చాన్నాళ్లుగా పాపులర్ అయింది. అయితే ఈ టైటిల్ పట్ల పోలీస్ శాఖ… వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వాళ్ళకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. […]
పొలీస్ డిపార్ట్ మెంట్ గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో ఇక చేసేదేమీ లేక మెంటల్ పొలీస్ టైటిల్ ని ”మెంటల్ ” గా ఫిక్స్ చేసారు దర్శక నిర్మాతలు. సినిమా పేరులోంచి పోలీస్ అనే పదాన్ని తొలిగించారు. సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రం ”మెంటల్ పొలీస్” . ఈ పేరు చాన్నాళ్లుగా పాపులర్ అయింది. అయితే ఈ టైటిల్ పట్ల పోలీస్ శాఖ… వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వాళ్ళకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసు అధికారుల సంఘం మాత్రం దీనికి ఒప్పుకోలేదు. మెంటల్ పోలీస్ అనే టైటిల్ తమ మనోభావాల్నిదెబ్బతీస్తుందని, ప్రజల్లో తమపట్ల గౌరవాన్ని, నమ్మకాన్ని తగ్గిస్తుందని పోలీస్ అధికారుల సంఘం గట్టిగా అభిప్రాయపడింది. దాంతో మెంటల్ పొలీస్ ని ”మెంటల్ ” గా మార్చారు . శ్రీకాంత్ పవర్ ఫుల్ పొలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రాన్ని ఏవివి దుర్గా ప్రసాద్ నిర్మించగా బాబ్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై హీరో శ్రీకాంత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేక సతమతం అవుతున్న శ్రీకాంత్ కు ఇది ఆపరేషన్ దుర్యోధన , ఖడ్గం లాంటి సూపర్ హిట్ చిత్రాల తరహాలో ఊహించని విజయం అందుకుంటుందని ఆశిస్తున్నాడు. మరోవైపు పోలీసులు మాత్రం ఇకపై పోలీస్ అనే టైటిల్ వాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.