అరగంటలో మాయ... బాబూ సిగ్గుసిగ్గు

చంద్రబాబు ప్రభుత్వం రాజధాని విషయంలో బరితెగించినట్టుగానే ఉంది. స్విస్ చాలెంజ్ లో తనకు నచ్చిన సింగపూర్ కంపెనీలకు రాజధాని పనులను కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్న చంద్రబాబు అందుకు నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ ముందుకెళ్తున్నారు. అంతా పారదర్శకంగా చేస్తామని స్విస్ చాలెంజ్‌లో ఇతర కంపెనీలను ఆహ్వానిస్తామని ఎప్పటిలాగే మీడియా ముందు కోతలు కోసిన బాబు… తీరా టెండర్ల నోటిఫికేషన్ విషయానికి వచ్చే సరికి అసలు ఉద్దేశం బయటపెట్టారు. స్విస్‌ చాలెంజ్ లో కంపెనీలను ఆహ్వానించేందుకు ఏపీ “ఈ-ప్రొక్యూర్‌మెంట్‌.కామ్‌” వెబ్‌సైట్‌లో సీఆర్‌డీఏ నోటిఫికేషన్ […]

Advertisement
Update:2016-07-19 03:36 IST

చంద్రబాబు ప్రభుత్వం రాజధాని విషయంలో బరితెగించినట్టుగానే ఉంది. స్విస్ చాలెంజ్ లో తనకు నచ్చిన సింగపూర్ కంపెనీలకు రాజధాని పనులను కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్న చంద్రబాబు అందుకు నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ ముందుకెళ్తున్నారు. అంతా పారదర్శకంగా చేస్తామని స్విస్ చాలెంజ్‌లో ఇతర కంపెనీలను ఆహ్వానిస్తామని ఎప్పటిలాగే మీడియా ముందు కోతలు కోసిన బాబు… తీరా టెండర్ల నోటిఫికేషన్ విషయానికి వచ్చే సరికి అసలు ఉద్దేశం బయటపెట్టారు.

స్విస్‌ చాలెంజ్ లో కంపెనీలను ఆహ్వానించేందుకు ఏపీ “ఈ-ప్రొక్యూర్‌మెంట్‌.కామ్‌” వెబ్‌సైట్‌లో సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు వెబ్‌సైట్లో ప్రకటన ఉంచుతామని చెప్పి… సాయంత్రం ఆరున్నరకు అప్‌లోడ్ చేశారు. సాధారణంగా అయితే ఇతర కంపెనీలు నిర్ణయం తీసుకునేందుకు వీలుగా 60 రోజుల పాటు నోటిఫికేషన్ ఉంచాలి. కానీ అరగంటకే వెబ్‌సైట్‌ నుంచి దాన్ని తీసేశారు. అలా చేయడం ద్వారా సింగపూర్‌ కంపెనీలకు మరే కంపెనీ పోటీ రాకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు.

అంతేకాదు నోటిఫికేషన్‌లో ప్రభుత్వ రెవెన్యూ వాటా గురించి చంద్రబాబు ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రాజెక్ట్‌ ద్వారా వచ్చే రెవెన్యూలో ఎంతవాటాను ఏపీ ప్రభుత్వానికి ఇస్తారనే విషయాన్ని సింగపూర్‌ కంపెనీల ఆదేశాల మేరకే చంద్రబాబు గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఇతర కంపెనీలు పోటీకి రాకుండా చంద్రబాబు సింగపూర్‌బాబులకు రాచబాట వేశారు. మొత్తానికి ఆంధ్రుల రాజధాని అమరావతిని చంద్రబాబు విజయవంతంగా సింగపూర్ దొరలకు తాకట్టు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇకపై అమరావతిలో భూ,ఇతర వివాదాలను ఎవరైనా సరే మన కోర్టుల్లో సవాల్ చేసేందుకు లేదు. సింగపూర్ కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం లండన్ కోర్టుకు వెళ్లి అక్కడే పోరాడాల్సి ఉంటుంది. ఇది చంద్రబాబు తెలుగుజాతికి మిగిల్చిన గౌరవం. మన నేలలో వివాదాలను తెల్లదొరల దేశానికి వెళ్లి పరిష్కరించుకోవాలట. ఇంతకన్నా సిగ్గుచేటు తెలుగుజాతికి, ఈ దేశానికి ఏమైనా ఉంటుందా?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News