బాబు కుల రాజ్యం స్థాపిస్తున్నారు- కత్తి ఫైర్
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో కులపాలన సాగిస్తున్నారని కత్తిపద్మారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు తన సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు నాగార్జున యూనిర్శిటీని చంద్రబాబు తన కుల రాజ్యంగా మార్చుకున్నారని మండిపడ్డారు. అప్పటి వరకు రిజిస్ట్రార్‌గా ఉన్న దళితుడిని తొలగించి చంద్రబాబు తన సామాజికవర్గం వ్యక్తికి నాగార్జునయూనివర్శిటీలో పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. లైబ్రేరియన్‌గా ఉన్న వ్యక్తిని కార్యనిర్వాహక కమిటీలో చేర్చి యూనివర్సిటీని కులరాజ్యంగా మార్చారన్నారు. యూనివర్శిటీల్లో ఎస్సీఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునే […]
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో కులపాలన సాగిస్తున్నారని కత్తిపద్మారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు తన సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు నాగార్జున యూనిర్శిటీని చంద్రబాబు తన కుల రాజ్యంగా మార్చుకున్నారని మండిపడ్డారు. అప్పటి వరకు రిజిస్ట్రార్‌గా ఉన్న దళితుడిని తొలగించి చంద్రబాబు తన సామాజికవర్గం వ్యక్తికి నాగార్జునయూనివర్శిటీలో పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. లైబ్రేరియన్‌గా ఉన్న వ్యక్తిని కార్యనిర్వాహక కమిటీలో చేర్చి యూనివర్సిటీని కులరాజ్యంగా మార్చారన్నారు.
యూనివర్శిటీల్లో ఎస్సీఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునే పరిస్థితులు లేకుండా అభద్రత భావాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. నాగార్జున వర్శిటీలో ఒకే కులానికి చెందిన ఐదుగురు వ్యక్తుల చేతిలో పాలన సాగుతోందన్నారు కత్తి పద్మారావు. ఏఎన్‌యూలో కుల, మత భావాలను ఆచరిస్తున్న రెక్టార్ కె.ఆర్.ఎస్.సాంబశివరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.నరసింహారావు, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ పి.శంకరపిచ్చయ్య, పాలకమండలి సభ్యుడు కె.వెంకట్రావులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Click on Image to Read: