సేమ్‌ డైలాగ్‌.. మోదీని ప్రెస్‌మీట్‌లో వాడేసిన చంద్రబాబు

మోదీతో తనకు చాలా దగ్గర సంబంధాలున్నాయని చాటుకునేందుకో లేక నిజంగానే మోదీ పదేపదే చంద్రబాబుకు ఫోన్‌ చేస్తున్నారో ఏమో గానీ చైనా పర్యటకు వెళ్లి వచ్చిన సమయంలో చెప్పిన డైలాగునే రష్యా పర్యటన వివరాలు వెల్లడించిన సందర్భంగానూ చంద్రబాబు చెప్పారు.  తాను పర్యటించిన దేశాల చరిత్రను ప్రెస్ మీట్ మొదట్లో వివరించడం అలవాటు చేసుకున్న చంద్రబాబు… ఎప్పటిలాగే   రష్యా ఎలా పతనమైందన్నది ఓ ఐదు నిమిషాల పాటు వివరించారు. కజికిస్తాన్‌లో పరిస్థితులను వెల్లడించారు. అనంతరం అమరావతితో ఆయా […]

Advertisement
Update:2016-07-15 16:19 IST

మోదీతో తనకు చాలా దగ్గర సంబంధాలున్నాయని చాటుకునేందుకో లేక నిజంగానే మోదీ పదేపదే చంద్రబాబుకు ఫోన్‌ చేస్తున్నారో ఏమో గానీ చైనా పర్యటకు వెళ్లి వచ్చిన సమయంలో చెప్పిన డైలాగునే రష్యా పర్యటన వివరాలు వెల్లడించిన సందర్భంగానూ చంద్రబాబు చెప్పారు. తాను పర్యటించిన దేశాల చరిత్రను ప్రెస్ మీట్ మొదట్లో వివరించడం అలవాటు చేసుకున్న చంద్రబాబు… ఎప్పటిలాగే రష్యా ఎలా పతనమైందన్నది ఓ ఐదు నిమిషాల పాటు వివరించారు. కజికిస్తాన్‌లో పరిస్థితులను వెల్లడించారు. అనంతరం అమరావతితో ఆయా దేశాలకు ఉన్న సారూప్యతను వివరించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ బాబు విదేశీ పర్యటనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోదీ మద్దతు కూడా తనకుందని పరోక్షంగా చంద్రబాబు చెప్పుకున్నారు. మొన్న చైనా వెళ్లివచ్చిన సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు… చైనాలోని ఒక నగరాన్ని అద్భుతంగా నిర్మించారని…30 రోజుల వ్యవధిలోనే 50 అంతస్తుల భవనాన్ని నిర్మించారని చెప్పారు. ఈ కట్టడాలను వెళ్లి చూడాల్సిందిగా మోదీయే స్వయంగా కలిసి చెప్పారని గత ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు చెప్పారు. అందుకే చైనా వెళ్లి ఆ కట్టడాలను పరిశీలించానన్నారు. తాజాగా రష్యా, కజికిస్తాన్ పర్యటన వివరాలను ప్రెస్‌కు వెల్లడిస్తూ మళ్లీ మోదీ ప్రస్తావన తెచ్చారు చంద్రబాబు.

కజికిస్తాన్‌లో ఆస్తానా నగరాన్ని అద్బుతంగా నిర్మించారని చంద్రబాబు కితాబిచ్చారు. ఆస్తానా గురించి కూడా మోదీయే ఫోన్‌ చేసి చెప్పారన్నారు. అది కూడా గోదావరి పుష్కరాల్లో ప్రమాదం జరిగిన రోజే ఫోన్‌ చేసి ఆస్తానా నగరాన్ని చూసి రావాల్సిందిగా మోదీ చెప్పారన్నారు. అందుకే అక్కడ పర్యటించానని చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానాలేసుకుని వెళ్లి వందలకోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న వేళ చంద్రబాబు మోదీ పేరు చెప్పడం ఆసక్తిగా ఉంది. చంద్రబాబు పర్యటనపై మోదీ ప్రభుత్వం అసంతృప్తితో ఉందని బాబుపై నిఘా కూడా పెట్టారని వస్తున్న వార్తల నేపథ్యంలో అలాంటిదేమీ లేదు మోదీకి కూడా ఇందులో ప్రమేయం ఉందని నమ్మించేందుకు ఏపీ సీఎం ప్రయత్నించినట్టుగా ఉందంటున్నారు. లేకుంటే ఒకసారి కాదు పదేపదే ఒక ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్‌ చేసి ఆ దేశానికి వెళ్లు ఈ దేశానికి వెళ్లు అని ఎందుకు సలహాలిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయినా ఎవరినైనా వాడేయడంలో దిట్టగా పేరున్న చంద్రబాబు … మోదీని కూడా వదిలిపెట్టడం లేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News