టీ కాంగ్రెస్‌కు పాడె సిద్ధం చేస్తున్న సోనియా
కాంగ్రెస్ అధిష్టానం. అది మేధావులని చెప్పుకునే నేతల సమూహం. కానీ వారి సొంత రాష్ట్రాల్లో మాత్రం పార్టీని గెలిపించలేరు. కొంతమంది సొంతంగానూ గెలవలేరు. గుజరాత్‌లో గెలవడం చేతగాని అహ్మద్ పటేల్ సోనియాకు రాజకీయ సలహాలిస్తుంటారు. తమిళనాడలో పార్టీ ఆనవాళ్లు కూడా నిలపలేని చిదంబరం దేశాన్ని ప్రభావితం చేస్తుంటారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ నాయకులతో లోపాయికారి సంబంధాలు నెరపడంలో దిట్ట చిదంబరం. ఆయనకు కాంగ్రెస్ ప్రయోజనాలకన్నా తన ప్రయోజనాలు ముఖ్యం. ఇలా చెబుతూ పోతే సోనియా […]
కాంగ్రెస్ అధిష్టానం. అది మేధావులని చెప్పుకునే నేతల సమూహం. కానీ వారి సొంత రాష్ట్రాల్లో మాత్రం పార్టీని గెలిపించలేరు. కొంతమంది సొంతంగానూ గెలవలేరు. గుజరాత్‌లో గెలవడం చేతగాని అహ్మద్ పటేల్ సోనియాకు రాజకీయ సలహాలిస్తుంటారు. తమిళనాడలో పార్టీ ఆనవాళ్లు కూడా నిలపలేని చిదంబరం దేశాన్ని ప్రభావితం చేస్తుంటారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ నాయకులతో లోపాయికారి సంబంధాలు నెరపడంలో దిట్ట చిదంబరం. ఆయనకు కాంగ్రెస్ ప్రయోజనాలకన్నా తన ప్రయోజనాలు ముఖ్యం. ఇలా చెబుతూ పోతే సోనియా చుట్టూ ఉన్న వారంతా జనాలతో తిరస్కరించబడిన వారే. అలాంటి వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు ఆ మేధావులంతా కలిసి తెలంగాణ కాంగ్రెస్‌ను పైకి లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు పార్టీని పైకి తెచ్చేందుకు చేస్తున్నారా లేక పాడె కట్టేందుకు చేస్తున్నారా అన్నది సగటు కాంగ్రెస్ కార్యకర్తలకే అర్థం కావడం లేదు.
తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు సోనియా అండ్ టీం కసరత్తు చేసింది. అందరూ జనాలతో మంచి సంబంధాలున్న మాస్ లీడర్‌కు ఈ సారి అవకాశం ఇస్తారని అంచనా వేశారు. కానీ సోనియా గాంధీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఖరారు చేశారని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి.అదే నిజమైతే కాంగ్రెస్ కు ఎంత వరకు ఉపయోగం అన్నది చర్చనీయాంశమైంది. జనాలతో సంబంధం లేని, పార్టీ శ్రేణులతో కనీస పరిచయాలు లేని అజారుద్దీన్ తెలంగాణ కాంగ్రెస్‌ను నడుపుతారట. ఆయన సారథ్యంలో కేసీఆర్‌ను ఢీకొడుతారట. తెలంగాణలో సామాజికపరిస్థితులను గమనిస్తే తొలి నుంచి రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారుగా ఉంది. గ్రౌండ్ లెవల్‌లో చక్రం తిప్పేది కూడా వారే. అలాంటి చోట మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న, బహు వివాహాలు చేసుకున్న అజారుద్దీన్ వచ్చి పార్టీ నడపగలరా?. ఆయన కేడర్‌కు, ప్రజలకు ఆదర్శంగా నిలవగలరా?. తమని కాదని నాయకత్వం మరొకరికి ఇస్తే రెడ్డిసామాజికవర్గం కాంగ్రెస్‌తో ఉంటుందా?. భవిష్యత్తులో పార్టీ పగ్గాలు తమ చేతికి వస్తాయని ఎదురుచూస్తున్న డీకే అరుణ, కోమటిరెడ్డి బ్రదర్స్, ఇతర కీలక నేతలు కాంగ్రెస్‌లో ఉంటారా?.
దశాబ్దాలుగా జనంలో తిరుగుతూ రాజకీయాలు చేస్తున్ననేతలు… మరో రంగానికి చెందిన అజారుద్దీన్‌కు సలాం కొడుతూ బతికేందుకు ఇష్టపడుతారా?. ఏసీ గదులకు అలవాటు పడ్డ ఈ మాజీ క్రికెటర్ కాంగ్రెస్‌ను గట్టేక్కించేందుకు ఎండపాటున గ్రామగ్రామాన తిరగగలరా?. పార్టీ ఖర్చులకు పైసలు తేగలరా?. అజార్‌ను చూసి మైనార్టీలంతా కాంగ్రెస్‌లోకి దూరిపోతారని సోనియా బృందం భ్రమించి ఉండవచ్చు. కానీ ఎంఐఎంను కాదని పాతబస్తీలో కాంగ్రెస్ పాగావేయగలదా?. ఇతర నియోజకవర్గాల్లోనూ అజార్ ను చూసి మైనార్టీలు ఓటేస్తారా?. ఒకవేళ అలా వేయాలంటే అజార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. అప్పుడు మిగిలిన వర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్ తమది అనుకుని పనిచేసిన వర్గాలు ఓకే చెప్పి ఓట్లేస్తాయా?. సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోనే ఏమి చేయాలో తెలియని దుస్థితిలో సోనియా కుటుంబం ఉంది. ఇక తెలంగాణలోనూ ఇంతకు మించి బీభత్సమైన వ్యూహాలు అమలు చేస్తారని ఎలా అంచనా వేయగలం?.
Click on Image to Read –