ఫిరాయింపులపై విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు
ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కఠినతరం చేసేలా ఆర్టికల్ 361బిని సవరించాలని బిల్లులో ప్రతిపాదించనున్నారు. పార్టీ ఫిరాయించే వారికి ఎలాంటి పదవులు దక్కకుండా చట్ట సవరణ చేయాలని కోరనున్నారు. ఈనెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఫిరాయింపు నిరోధక […]
ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కఠినతరం చేసేలా ఆర్టికల్ 361బిని సవరించాలని బిల్లులో ప్రతిపాదించనున్నారు. పార్టీ ఫిరాయించే వారికి ఎలాంటి పదవులు దక్కకుండా చట్ట సవరణ చేయాలని కోరనున్నారు.
ఈనెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని బలోపేతం చేసేందుకు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి. కొద్దిరోజుల క్రితం పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు కూడా ఫిరాయింపులను నిరోధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఫిరాయింపుబాధితుల జాబితాలో కాంగ్రెస్ కూడా ఉంది.
Click on Image to Read –