టాప్ 10లో లేని కుప్పం... ఇష్టులకు, ఒకే జిల్లాకు టాప్ ర్యాంకులు
చంద్రబాబు సొంత సర్వేలు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. ఈ సర్వేలు చేస్తున్న వారు కూడా చంద్రబాబు మనసెరిగి చేస్తున్నట్టుగా ఉంది. తాజాగా నియోజకవర్గాల్లో వ్యవసాయ, పరిశ్రమల, సేవ విభాగాల పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించుకున్నారు చంద్రబాబు. ఈ టాప్ ర్యాంకుల్లో చంద్రబాబుకు బాగా ఇష్టమైన కృష్టా జిల్లా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నవే ఉండడం గమనార్హం. టాప్ 10లో ఎక్కువగా ఒకే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లకే ర్యాంకులు వచ్చాయి. ఆఖరి ర్యాంకులను ఎక్కువగా వైసీపీ […]
చంద్రబాబు సొంత సర్వేలు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. ఈ సర్వేలు చేస్తున్న వారు కూడా చంద్రబాబు మనసెరిగి చేస్తున్నట్టుగా ఉంది. తాజాగా నియోజకవర్గాల్లో వ్యవసాయ, పరిశ్రమల, సేవ విభాగాల పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించుకున్నారు చంద్రబాబు. ఈ టాప్ ర్యాంకుల్లో చంద్రబాబుకు బాగా ఇష్టమైన కృష్టా జిల్లా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నవే ఉండడం గమనార్హం. టాప్ 10లో ఎక్కువగా ఒకే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లకే ర్యాంకులు వచ్చాయి. ఆఖరి ర్యాంకులను ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎస్సీఎస్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాటికి కట్టబెట్టారు. సర్వేకు విశ్వసనీయత తెచ్చే ప్రయత్నమో ఏమో గానీ టాప్ 10 నియోజకవర్గాల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మాత్రం లేదు. 175 నియోజకవర్గాల్లో తొలి స్థానం టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక ఉంది.
ఆపై వరుసగా విజయవాడ వెస్ట్( జలీల్‌ఖాన్), విజయవాడ ఈస్ట్( గద్దె రామ్మోహన్‌రావు, టీడీపీ), విజయవాడ సెంట్రల్( బోండా ఉమా, టీడీపీ)నియోజకవర్గాలకు అప్పగించారు. చంద్రబాబుకు నమ్మినవ్యక్తిగా పేరున్న బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు నియోకవర్గానికి కూడా టాప్10లో చోటు దక్కింది. తిరుపతి( సుగుణ, టీడీపీ), మైలవరం( దేవినేని ఉమా, టీడీపీ) స్థానాలకు టాప్ 10లో చోటు దక్కింది. నియోజకవర్గంలో అభివృద్ధి కోసమేపార్టీ ఫిరాయిస్తున్నట్టు చెప్పి వెళ్లిన ఎస్వీమోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు నియోజకవర్గం కూడా అప్పుడే టాప్ 10లోకి చేరడం గమనార్హం.
ఇక ఆఖరి ర్యాంకులు చూస్తే పాతపట్నానికి దక్కింది. ఇక్కడ ఎమ్మెల్యే కేవీ రమణమూర్తి ఇటీవలే పార్టీ ఫిరాయించారు. మడకశిర(టీడీపీ),కురుపం(ST) (పుష్ప శ్రీవాణి, వైసీపీ), అముదాలవలస(కూన రవికుమార్, టీడీపీ), మంత్రాలయం( బాలనాగిరెడ్డి, వైసీపీ), నరసన్నపేట( టీడీపీ), పాలకొండ( కళావతి, వైసీపీ,ఎస్టీ నియోజకవర్గం), ఉరవకొండ( విశ్వేశ్వరరెడ్డి, వైసీపీ, ఉరవకొండకే చెందిన పయ్యావుల ఎమ్మెల్సీగా ఉన్నారు), కల్యాణదుర్గం( హనుమంతరాయ చౌదరి, టీడీపీ) నియోజకవర్గాలు ఆఖరి స్థానంలో ఉన్నాయి. మొత్తం మీద టాప్ ర్యాంకుల్లో ఐదు కృష్టా జిల్లాకు చెందిన టీడీపీ వారికే దక్కడం విశేషం. ( ఆంగ్ల పత్రిక సౌజన్యంతో)
click on image to read-