పల్స్‌ సర్వేలో బయటపడ్డ బాబు బాగోతం..

ఆంధ్రప్రదేశ్‌లోని జనాల పుట్టుపూర్వత్తరాలతో సహా అన్ని వివరాలను సేకరించేందుకు శుక్రవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్స్ సర్వే చేపట్టింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచే ఈ సర్వే ప్రారంభించారు అధికారులు. చంద్రబాబు, లోకేష్‌ల వివరాలను దగ్గరుండి తీసుకున్నారు. అయితే ఈ సర్వేలో చంద్రబాబుకు సంబంధించిన కొన్ని విషయాలు, మరికొన్ని అనుమానాలు బయలుదేరాయి. చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణవాసిగానే ఉన్నారు. తన ఆధార్‌తో పాటు ఓటు హక్కు( చంద్రబాబు ఆధార్ కార్డు నెంబర్- 300300688099, ఓటరు ఐడీ- 2036739) […]

Advertisement
Update:2016-07-09 03:54 IST

ఆంధ్రప్రదేశ్‌లోని జనాల పుట్టుపూర్వత్తరాలతో సహా అన్ని వివరాలను సేకరించేందుకు శుక్రవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్స్ సర్వే చేపట్టింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచే ఈ సర్వే ప్రారంభించారు అధికారులు. చంద్రబాబు, లోకేష్‌ల వివరాలను దగ్గరుండి తీసుకున్నారు. అయితే ఈ సర్వేలో చంద్రబాబుకు సంబంధించిన కొన్ని విషయాలు, మరికొన్ని అనుమానాలు బయలుదేరాయి. చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణవాసిగానే ఉన్నారు.

తన ఆధార్‌తో పాటు ఓటు హక్కు( చంద్రబాబు ఆధార్ కార్డు నెంబర్- 300300688099, ఓటరు ఐడీ- 2036739) కూడా హైదరాబాద్‌లోనే ఉందని చంద్రబాబు స్వయంగా ఎన్యూమరేటర్‌కు చెప్పారు. తన వార్షిక సంపాదన అంతా కలిపితే 36లక్షలుగా వెల్లడించారు. సొంతూరు నారావారిపల్లెలో స్థిర, చరాస్తులు ఉన్నాయని చెప్పిన చంద్రబాబు వాటి వివరాలను మాత్రం తర్వాత వెల్లడిస్తానని చెప్పడం విశేషం. సర్వే జరుగుతున్న సమయంలో ఇంట్లో లోకేష్, చంద్రబాబు మాత్రమే ఉన్నారు. అయితే తమ కుటుంబసభ్యులు మొత్తం ఐదుగురు ఉంటామని వారి వివరాలు చంద్రబాబే చెప్పారు. ఇక్కడే సామాన్యులకు, సర్వే అధికారులకు కొత్త అనుమానాలు బయలుదేరాయి.

1. ఆధార్‌,ఓటరు ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో లేని వారిని కూడా ఏపీ లెక్కల్లోకే తీసుకుంటారా?

2. చంద్రబాబు తనకు స్థిర, చరాస్తులు ఉన్నాయని అయితే వాటి వివరాలు తర్వాత చెబుతాను అన్నారు. అంటే జనం కూడా తమ స్థిర,చరాస్తులను తర్వాత చెబుతామంటే పల్స్ సర్వే అధికారులు అభ్యంతరం చెప్పరా?

3. సర్వే జరుగుతున్న సమయంలో సదరు కుటుంబసభ్యులంతా తప్పనిసరిగా ఉండాల్సిన పనిలేదా?. ఎందుకంటే చంద్రబాబు ఇంటికి పల్స్ సర్వే అధికారులు వచ్చినప్పుడు ఆయన, కుమారుడు మాత్రమే ఉన్నారు. భార్య, కోడలు, మనవడు లేరు. అంటే కుటుంబంలో ఎవరైనా అందుబాటులో లేకున్నా వారి వివరాలను ఇతర సభ్యులే సమర్పించవచ్చా? .

4. సర్వే సమయంలో చంద్రబాబు, లోకేష్‌ల ఐరిష్‌ కూడా అధికారులు రికార్డు చేశారు. మరి అందుబాటులో లేని కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటి?.

5. చంద్రబాబుకు వర్తించిన నియమ నిబంధనలే సాధారణ ప్రజలకూ వర్తిస్తాయా?. లేక ఆయన సీఎం కాబట్టి, ఆయనకు , ఆయన కుటుంబసభ్యులకు మినహాయింపులుంటాయా?.

6. ఒకవేళ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాబట్టి అక్కడి ఆధార్‌, తెలంగాణ ఓటర్ ఐడీని కూడా పరిగణలోకి తీసుకుంటారా?. ఏమైనా పల్స్ సర్వే సీరియస్‌నెస్‌ను స్వయంగా చంద్రబాబే నీరు గార్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

click on image to read-

Tags:    
Advertisement

Similar News