మరో వర్గం తయారవుతోంది...
చంద్రబాబు అవినీతి పాలనకు వ్యతిరేకంగా టీడీపీలోనే మరో వర్గం తయారవుతోందని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పార్థసారథి అన్నారు. చంద్రబాబు పేరు చెబితేనే ఎన్టీఆర్ అభిమానులు, ఒక వర్గం నాయకులు చీ కొడుతున్నారని చెప్పారు. గ్రీన్ జోన్ పేరుతో కృష్ణా జిల్లా రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజలు సున్నా మార్కులు వేస్తున్నారని పార్థసారథి చెప్పారు. రాజధాని రైతులను నాశనం చేసిన చంద్రబాబు ఇప్పుడు పోర్టు పేరుతో మచిలీపట్నంలో […]
చంద్రబాబు అవినీతి పాలనకు వ్యతిరేకంగా టీడీపీలోనే మరో వర్గం తయారవుతోందని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పార్థసారథి అన్నారు. చంద్రబాబు పేరు చెబితేనే ఎన్టీఆర్ అభిమానులు, ఒక వర్గం నాయకులు చీ కొడుతున్నారని చెప్పారు. గ్రీన్ జోన్ పేరుతో కృష్ణా జిల్లా రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజలు సున్నా మార్కులు వేస్తున్నారని పార్థసారథి చెప్పారు. రాజధాని రైతులను నాశనం చేసిన చంద్రబాబు ఇప్పుడు పోర్టు పేరుతో మచిలీపట్నంలో లక్ష ఎకరాలు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
పోర్టు పరిశ్రమల పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలు భూములు అమ్ముకోవడానికి కుట్ర చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని ఆరోపించారు. మచిలీపట్నం మండలంలోని 34 గ్రామాలు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. బాబు తలక్రిందులుగా తపస్సు చేసినా రైతులు ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వరని చెప్పారు.
జైలుకైనా వెళ్తాం. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదన్నారు. పోర్టుకు అవసరమైన 4,800 ఎకరాల భూమి ఇవ్వడానికి రైతులు సిద్ధమని, అంతకుమించి ఒక్క ఎకరం కూడా తీసుకోవడానికి వీల్లేదన్నారు. అందులో కూడా రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు భూమి పిచ్చిపట్టుకుందని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోర్టుకు రెండు వేల ఎకరాలు చాలన్న చంద్రబాబు ఇప్పుడు… లక్ష ఎకరాలు కావాలడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎక్కడ భూములు కనిపించినా వాటిని కార్పొరేట్‌సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు.
బందరు పోర్టు కంపెనీలో చంద్రబాబుకు వాటాలున్నాయని అందుకే పోర్టుకు లక్ష ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసీపీ నేత గౌతంరెడ్డి ఆరోపించారు.
click on image to read-