చెప్పులతో కొట్టుకున్న వైసీపీ చోటా నేతలు
వైసీపీలో కీలకమైన నాయకులంతా కలిసి పనిచేసుకుపోతున్నా… చిన్నచిన్న అనుబంధ కమిటీలు మాత్రం ఆ పార్టీ పరువును నడిబజారులో ఈడుస్తున్నాయి. తాజాగా చెన్నైలో పార్టీ చెన్నై సేవాదళం నాయకులు చెప్పులతో కొట్టుకున్నారు. అదికూడా వైఎస్ జయంతి కార్యక్రమంలోనే చెప్పులు, బూట్లు విసురుకున్నారు. అధికార ప్రతినిధి పదవి కోసం కొద్దికాలంగా చెన్నైసేవాదళంలో ఫైట్ నడుస్తోంది. ప్రస్తుత అధికార ప్రతినిధి సైకం రామకృష్ణారెడ్డిని తొలగించేశారని లక్ష్మీశ్రీదేవిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. అధికార ప్రతినిధిగా తనను నియమించారని ఆమె ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం […]
వైసీపీలో కీలకమైన నాయకులంతా కలిసి పనిచేసుకుపోతున్నా… చిన్నచిన్న అనుబంధ కమిటీలు మాత్రం ఆ పార్టీ పరువును నడిబజారులో ఈడుస్తున్నాయి. తాజాగా చెన్నైలో పార్టీ చెన్నై సేవాదళం నాయకులు చెప్పులతో కొట్టుకున్నారు. అదికూడా వైఎస్ జయంతి కార్యక్రమంలోనే చెప్పులు, బూట్లు విసురుకున్నారు. అధికార ప్రతినిధి పదవి కోసం కొద్దికాలంగా చెన్నైసేవాదళంలో ఫైట్ నడుస్తోంది. ప్రస్తుత అధికార ప్రతినిధి సైకం రామకృష్ణారెడ్డిని తొలగించేశారని లక్ష్మీశ్రీదేవిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. అధికార ప్రతినిధిగా తనను నియమించారని ఆమె ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చెన్నైలోని సేవాదళం కార్యాయలంలో వైఎస్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అక్కడే ఇరు వర్గాలు తలబడ్డాయి. వైఎస్ చిత్రపటాన్ని ముందుపెట్టుకుని డిష్యూం డిష్యూం అని కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుల వర్షం కురిపించుకున్నారు. ఈ పరిస్థితిపై వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో పనిఉన్న కమిటీలకంటే పనిలేని కమిటీల మధ్యే పోరే ఎక్కువైందని ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై కొద్దికాలంగా సోషల్ మీడియాలోనూ పెద్దెత్తున వైసీపీ అభిమానులే గగ్గోలు పెడుతున్నారు.కీలకమైన విభాగాలపై మాత్రమే ఫోకస్ పెడుతున్న పార్టీ నాయకత్వం చోటామోటా అనుబంధ సంఘాలను గాలికొదిలేసిందని… అందుకే ఇలా ఎవరికి వారు నాయకులుగా ప్రకటించుకుని తిరుగుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది. చూడాలి చెప్పులతో కొట్టుకున్న సేవాదళం విషయంలో పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎలా ఉంటాయో!.
click on image to read-