మోడీ మంత్రివర్గంలో 72మంది కోటీశ్వరులు...24 మంది క్రిమినల్లు
కేంద్ర మంత్రివర్గంలో ఉన్న78మందిలో 72మంది కోటీశ్వరులున్నారు. వీరి సగటు ఆస్తులు 12. 94 కోట్లు. కేబినేట్‌లో మొదటి ముగ్గురు సంపన్నులు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (113 కోట్లు), ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హెచ్ కె బాదల్ (108 కోట్లు), ఇంధన వనరుల మంత్రి పీయూష్ గోయల్ (95కోట్లు). కొత్తగా మంత్రివర్గంలో చేరినవారిలో ఎంజె అక్బర్ అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తి 44.90 కోట్లు. నూతన మంత్రుల ఆస్తుల సగటు 8. 73 కోట్లుగా ఉంది. అతి […]
కేంద్ర మంత్రివర్గంలో ఉన్న78మందిలో 72మంది కోటీశ్వరులున్నారు. వీరి సగటు ఆస్తులు 12. 94 కోట్లు. కేబినేట్‌లో మొదటి ముగ్గురు సంపన్నులు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (113 కోట్లు), ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హెచ్ కె బాదల్ (108 కోట్లు), ఇంధన వనరుల మంత్రి పీయూష్ గోయల్ (95కోట్లు). కొత్తగా మంత్రివర్గంలో చేరినవారిలో ఎంజె అక్బర్ అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తి 44.90 కోట్లు. నూతన మంత్రుల ఆస్తుల సగటు 8. 73 కోట్లుగా ఉంది. అతి తక్కువ ఆస్తులున్న ముగ్గురు మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి (37లక్షలు), అనిల్ మాధవ్ దవే (60లక్షలు), అజయ్ టంటా (63లక్షలు).
మంత్రుల్లో 31శాతం మంది అంటే 24 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఇందులో 14 మందిపై హత్యా యత్నం, మతసామరస్యానికి భంగం కలిగించడం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన లాంటి అభియోగాలున్నాయి. మొత్తానికి ప్రజాస్వామ్యం…చాలా విచిత్రమైంది. ప్రజాసేవకులమని చెప్పుకునే వారంతా కోటీశ్వరులు అయి ఉంటారు. ఆ సేవలు అందుకునే ప్రజల్లో ఎక్కువ శాతం మంది పేదరికంలో మగ్గుతుంటారు.