కొత్తమంత్రి
పూర్వం కేరళలో ప్రతాపవర్మ అన్న ఒక రాజువుండేవాడు. అతనికి అయ్యప్పన్ అన్న మంగలి గడ్డం గీసేవాడు. రాజుకు అయ్యప్పన్ అంటే ఎంతో యిష్టం. కారణం చిన్నప్పటి నించీ అయ్యప్పన్ రాజుకు తెలుసు. అతను రాజుకు ఎన్నోన్నో కథలు చెప్పేవాడు. కబుర్లు చెప్పేవాడు. ఆ పరిచయం వల్ల అతనంటే ప్రతాపవర్మకు యిష్టం. పైగా అయ్యప్పన్ ప్రతాపవర్మను చిన్నప్పటినుంచి తెలిసినవాడు. కాబట్టి రాజుగారి యిష్టాయిష్టాల్ని గ్రహించే నేర్పరితనం అలవడింది. రాజుకు నచ్చిన మాటలు చేబుతూ రాజుగారి మెప్పపొందాడు. ఇట్లు వుండగా […]
పూర్వం కేరళలో ప్రతాపవర్మ అన్న ఒక రాజువుండేవాడు. అతనికి అయ్యప్పన్ అన్న మంగలి గడ్డం గీసేవాడు. రాజుకు అయ్యప్పన్ అంటే ఎంతో యిష్టం. కారణం చిన్నప్పటి నించీ అయ్యప్పన్ రాజుకు తెలుసు. అతను రాజుకు ఎన్నోన్నో కథలు చెప్పేవాడు. కబుర్లు చెప్పేవాడు. ఆ పరిచయం వల్ల అతనంటే ప్రతాపవర్మకు యిష్టం.
పైగా అయ్యప్పన్ ప్రతాపవర్మను చిన్నప్పటినుంచి తెలిసినవాడు. కాబట్టి రాజుగారి యిష్టాయిష్టాల్ని గ్రహించే నేర్పరితనం అలవడింది. రాజుకు నచ్చిన మాటలు చేబుతూ రాజుగారి మెప్పపొందాడు.
ఇట్లు వుండగా ఒక రోజు అయ్యప్పన్ రాజుకు గడ్డం గీస్తున్నాడు. ఆ సందర్భంలో రాజు మంచి మూడ్‌లో వున్నాడు. అయ్యప్పన్‌తో నాకు ఎందుకో నీకు ఏదయినా చెయ్యాలని పిస్తోంది నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు.
అయ్యప్పన్ ‘రాజా’ మీదయవల్ల చల్లగా వున్నాను. నాకు ఇంతకు మించి ఏంకావాలి చెప్పండి’ అన్నాడు.
ప్రతాపవర్మ ‘అది సరే కానీ నువ్వు ఏంకోరినా కాదనకుండా యిస్తాను, కోరుకో’ అన్నాడు.
అయ్యప్పన్ ‘రాజా! మీరింతగా అడుగుతున్నారు కాబట్టి నన్ను ప్రధానమంత్రిని చెయ్యండి’ అన్నాడు.
రాజు సరేనని పాత ప్రధానిని తొలగించి కొత్తప్రధానిని నియమించాడు.
దాంతో అయ్యప్పన్ ‘ప్రధానమంత్రి’ అయ్యాడు. పరిపాలన ప్రారంభమయింది. రాజుగారి ఖజానా చాలా విలువైంది. దాని రక్షణకు వేలాది సైన్యం అవసరమా? అని అయ్యప్పన్ అనుకున్నాడు.
రాజుతో ‘రాజుగారు! ఖజానాలోని నగలు, ధనానికి యింత సైన్యం అవసరమా? పైగా యుద్ధాలూ ఏమీ లేవు అసలు వేరే దేశం సైనికులు వచ్చినా నేను వాళ్ళని ఎదుర్కొనే పద్ధతి ఏర్పాటు చేస్తా అన్నాడు. రాజు ‘ఎలా’ అన్నాడు.
అయ్యప్పన్ ఈ వేలమంది సైన్యాన్ని పోషించడానికి లక్షలు ఖర్చవుతాయి. వాళ్ళని తీసేసి వందకుక్కల్ని ఈ ఖజానాకి కాపలా పెట్టండి. అన్నాడు. రాజు అతను చెప్పినట్లు చేశాడు. కుక్కల్ని మేపడానికి కేవలం నలుగురు పని మనుషుల్ని పెట్టారు. తను రాజ్యానికి ఎంత మేలు చేశానో రాజుకి ఎంత ఆదా చేశానో అని అయ్యప్పన్ మురిసిపోయాడు.
ఈ సంగతి పక్క దేశం రాజుకి తెలిసింది. సైన్యంతో దండెత్తివచ్చాడు. కుక్కల్ని వాళ్ళమీదకు వుసిగొల్పినా అవి పరస్పరం అరచుకుని, కరచుకున్నాయి. పక్క రాజ్యం సైన్యం ఈ రాజ్యాన్ని ఆక్రమించింది. పొరుగురాజు ప్రతాపవర్మని కట్టుబట్టల్తో రాజ్యం వదిలి వెళ్ళమన్నాడు.
అయ్యప్పన్ ప్రతాపవర్మను చూసి రాజుగారూ! మీరు దిగలుపడకండి జీవించలేమని భయపడకండి మా కులవృత్తి వుంది నా దగ్గరో కత్తి వుంది. ఎప్పటిదో మా నాన్నదో కత్తి వుంది. కావాలంటే మా నాన్న కత్తి నేను తీసుకుని నా కత్తి మీకిస్తాను అన్నాడు.
– సౌభాగ్య