అడవిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ప్రధానార్చకుడు
కర్నాటకలోని మైసూర్ మహారాజ్ ప్యాలెస్‌లో ప్రధాన అర్చకుడు బాలసుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే యువరాజుకు దగ్గరుండి వివాహం జరిపించిన సుబ్రమణ్యం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. కొంత కాలంగా బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్న ప్రధాన అర్చకుడు మంత్రాలయం వెళ్తున్నట్టు చెప్పి వెళ్లారు. బసవ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఆయన మార్గమధ్యలో కోసిగి మండలం ఐరన్‌గల్ వద్ద దిగి పొలాల్లోకి వెళ్లిపోయారు. అక్కడే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీన్ని గమనించిన కొందరు 108 […]
కర్నాటకలోని మైసూర్ మహారాజ్ ప్యాలెస్‌లో ప్రధాన అర్చకుడు బాలసుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే యువరాజుకు దగ్గరుండి వివాహం జరిపించిన సుబ్రమణ్యం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. కొంత కాలంగా బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్న ప్రధాన అర్చకుడు మంత్రాలయం వెళ్తున్నట్టు చెప్పి వెళ్లారు. బసవ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఆయన మార్గమధ్యలో కోసిగి మండలం ఐరన్‌గల్ వద్ద దిగి పొలాల్లోకి వెళ్లిపోయారు. అక్కడే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీన్ని గమనించిన కొందరు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా ఆదోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మృతి చెందారు. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నారా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Click on Image to Read: