ఒక్కోజత 2 లక్షలు...రోజుకి ఐదుసార్లు మారుస్తారు...అడగరెందుకు!
ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక 70కోట్ల రూపాయల విలువ చేసే దుస్తులను ధరించారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మోడీ ధరించే ఒక్కో జత 2 లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందని, అలాంటి జతలు రోజుకి అయిదు మారుస్తారని, పైగా ఒక సారి ధరించిన వాటిని మళ్లీ వాడరని కేజ్రీవాల్ వెల్లడించారు. ఆ లెక్కన చూసుకుంటే మోడీ అధికారంలోకి వచ్చిన700 రోజుల్లో 70కోట్ల రూపాయల విలువైన దుస్తులను ధరించారని కేజ్రీవాల్ తెలిపారు. మిగిలిన దుస్తులకోసం మరో […]
ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక 70కోట్ల రూపాయల విలువ చేసే దుస్తులను ధరించారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మోడీ ధరించే ఒక్కో జత 2 లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందని, అలాంటి జతలు రోజుకి అయిదు మారుస్తారని, పైగా ఒక సారి ధరించిన వాటిని మళ్లీ వాడరని కేజ్రీవాల్ వెల్లడించారు. ఆ లెక్కన చూసుకుంటే మోడీ అధికారంలోకి వచ్చిన700 రోజుల్లో 70కోట్ల రూపాయల విలువైన దుస్తులను ధరించారని కేజ్రీవాల్ తెలిపారు.
మిగిలిన దుస్తులకోసం మరో అయిదు కోట్లు ఖర్చుచేశారని వివరించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం కోసం ఖర్చు చేసింది రూ.76 కోట్లేనని కానీ 526 కోట్లు ఖర్చు చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నదని కేజ్రీవాల్ అన్నారు. మోడీ దుస్తుల కోసం ఇంత ఖర్చు చేస్తున్నా మీడియా ఆ వివరాలు వెల్లడించడానికి ముందుకు రావటం లేదని ఆయన విమర్శించారు.