లక్ష బల్బులు వెలుగుతున్నాయో లేవో చెప్పగలను... దూరం నుంచి చూస్తే అచ్చం ఆడపిల్లలే...

చైనా టూర్‌ విశేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో మీడియా సమావేశంలో వివరించారు. ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే పనిలో తానున్నానని చెప్పారు. చైనాపై ప్రశంసల జల్లు కురిపించారు. స్పీడ్, స్కిల్, స్కేల్‌కు చైనా మారుపేరని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చైనాను భాగస్వామిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు పారిశ్రామికవేత్తలను తయారు చేసింది తానేనని చెప్పారు. ఇక్కడి పారిశ్రామికవేత్తలు విదేశాలకు వెళ్లి వ్యాపారాలు చేయాలని, అక్కడి వారు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వల్ల […]

Advertisement
Update:2016-07-01 13:43 IST

చైనా టూర్‌ విశేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో మీడియా సమావేశంలో వివరించారు. ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే పనిలో తానున్నానని చెప్పారు. చైనాపై ప్రశంసల జల్లు కురిపించారు. స్పీడ్, స్కిల్, స్కేల్‌కు చైనా మారుపేరని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చైనాను భాగస్వామిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు పారిశ్రామికవేత్తలను తయారు చేసింది తానేనని చెప్పారు. ఇక్కడి పారిశ్రామికవేత్తలు విదేశాలకు వెళ్లి వ్యాపారాలు చేయాలని, అక్కడి వారు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

టెక్నాలజీ వల్ల ఎన్నో విప్లవాత్మకమార్పులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో భూగర్భజలాలు ఎంత పెరిగాయో రోజు ఉదయమే తాను చూసుకుంటానని చెప్పారు. విశాఖపట్నంలో లక్ష ఎల్‌ఈడీ బల్బులు వెలుగుతున్నాయో లేవో తాను చెప్పగలనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికవేత్తలంటే ప్రపంచంలో చులకన భావం ఉందన్నారు.ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పాల్స్‌ అన్న భావన ఉందన్నారు. దీని పొగొడతానన్నారు. చైనాలో 30రోజుల్లో 50 అంతస్తుల భవనం కట్టారని… ఆ విషయాన్ని ఒక సారి ప్రధాని మోదీ తనతో చెప్పారని అన్నారు. తాను కూడా వెళ్లి చూశానన్నారు.

చైనాలో రోబోలతో మాట్లాడించారని దూరం నుంచి చూస్తే అచ్చం ఆడపిల్లలు మాట్లాడినట్టుగానే ఉందన్నారు చంద్రబాబు. హైస్పీడ్ రైళ్లన్నీ చైనాలో ఉన్నాయంటూ తన టూర్‌లో చూసిన అనుభవాలను చెప్పారు. చైనాలో వెనుకబడిన ప్రాంతంలోని ఎయిర్‌పోర్టులు కూడా అద్బుతంగా ఉన్నాయన్నారు. ఆ ఎయిర్‌పోర్టులను చూసి మన దేశంలో దిగాక… ఇక్కడి ఎయిర్‌పోర్టులు వెలవెలబోతున్నట్టుగా అనిపించిందన్నారు. ఇవేం ఎయిర్‌పోర్టులు అన్న భావన తనకు కలిగిందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News