అడ్డమైన గడ్డితిని మాట్లాడితే ఊరుకోను... జాగ్రత్త..
కాంగ్రెస్ పార్టీలో ఫైర్‌బ్రాండ్ గా పేరున్నడీకే అరుణ మరోసారి టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.మంత్రి జూపల్లి కృష్ణారావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంతకాలంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇరువురి మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. తాజాగా మంత్రి జూపల్లిని కాస్త ఘాటుగానే తిట్టారు డీకే అరుణ. పెండ తినేవారికి తనను విమర్శించే నైతిక అర్హత లేదంటూ ధ్వజమెత్తారు. ‘తనకు మెదడు ఉంది కాబట్టి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు వచ్చాయి.. మంత్రి […]
Advertisement
కాంగ్రెస్ పార్టీలో ఫైర్‌బ్రాండ్ గా పేరున్నడీకే అరుణ మరోసారి టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.మంత్రి జూపల్లి కృష్ణారావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంతకాలంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇరువురి మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరింది.
తాజాగా మంత్రి జూపల్లిని కాస్త ఘాటుగానే తిట్టారు డీకే అరుణ. పెండ తినేవారికి తనను విమర్శించే నైతిక అర్హత లేదంటూ ధ్వజమెత్తారు. ‘తనకు మెదడు ఉంది కాబట్టి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు వచ్చాయి.. మంత్రి జూపల్లికి మెదడులో పెండ ఉంది కాబట్టే.. పూర్తయ్యే ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు’ అంటూ ఆమె నిప్పులు చెరిగారు. మంచిమాటలకు మంచిగానే సమాధానం చెప్తానని, అయితే ప్రాజెక్టుల పేరుతో అడ్డమైన గడ్డి తిని మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని, అందుకే.. అమరువీరుల స్తూపం విరిగిపోవడంలో వారు పాటించిన నాణ్యత, అవినీతి బయటపడ్డాయని ఎద్దేవా చేశారు.
Advertisement