యువమంత్రి

ఒక గ్రామంలో సర్దార్‌ అనే యువకుడు వుండేవాడు. అతను మగ్గం నేసేవాడు. పేదవాడు కానీ చాలా తెలివైనవాడు. చురుకైనవాడు. ఎన్నో సమస్యల్ని అవలీలగా పరిష్కరించేవాడు. అతని కీర్తి అతని గ్రామాన్ని దాటి రాజు దాకా వ్యాపించింది. రాజు అతన్ని పిలిపించాడు. తన దగ్గర వుంచుకుని అతని మేధస్సును పరిశీలించాడు. అతను రాజుకు ఎన్నో మంచి సలహలనిచ్చి సహాయపడ్డాడు. అతని సూచనలు ఎంతో అర్థవంతంగా వుండడంతో రాజు ఎంతో సంతోషించి ఆ యువకుణ్ణి తన ముఖ్యమంత్రిగా నియమించాడు. అంతా […]

Advertisement
Update:2016-06-27 18:32 IST

ఒక గ్రామంలో సర్దార్‌ అనే యువకుడు వుండేవాడు. అతను మగ్గం నేసేవాడు. పేదవాడు కానీ చాలా తెలివైనవాడు. చురుకైనవాడు. ఎన్నో సమస్యల్ని అవలీలగా పరిష్కరించేవాడు. అతని కీర్తి అతని గ్రామాన్ని దాటి రాజు దాకా వ్యాపించింది. రాజు అతన్ని పిలిపించాడు. తన దగ్గర వుంచుకుని అతని మేధస్సును పరిశీలించాడు. అతను రాజుకు ఎన్నో మంచి సలహలనిచ్చి సహాయపడ్డాడు. అతని సూచనలు ఎంతో అర్థవంతంగా వుండడంతో రాజు ఎంతో సంతోషించి ఆ యువకుణ్ణి తన ముఖ్యమంత్రిగా నియమించాడు.

అంతా బాగానే వుంది కానీ ప్రపంచంలో అసూయకు లోపం వుండదు కదా! ఒక యువకుడు, పేదవాడు మగ్గం నేసేవాడు ఎంత గొప్పవాడయిన ముఖ్యమంత్రి స్థానాన్ని పొందడం చూసి ఎందరికో కన్ను కుట్టింది. అతన్ని ఎలాగయినా మంత్రిపదవి నించీ దించేయాలనీ ఎందరో కుట్ర పన్నారు. వాళ్ళందరిలో ముఖ్యుడు ఒక సామంతరాజు అతను సంపన్నుడు. అతను విలువైన వజ్రాలను తీసుకొచ్చి రాజుకు సమర్పించి రాజా!నాదొక విన్నపం. మీరు ప్రతిభను గుర్తించే ప్రభువులు. ఆ విషయంలో ఏమాత్రం సందేహంలేదు. కానీ ఒక సాధారణ వ్యక్తిని, పేదవాణ్ణి ముఖ్యమంత్రి స్థానంలో నిలపడం అంత మంచి పనికాదని అందరూ అనుకుంటున్నారు. ఐనా మీరు రాజులు, మీయిష్టం అన్నాడు. రాజు ఆ యువకుడు ప్రతిభావంతుడు. అతని వల్ల నాకు ఎంతో ఉపకారం జరిగింది. రాజపాలనలో అతని సహాయం విలువ కట్టలేనిది. అట్లాంటి వాణ్ణి ఎట్లా కాదంటాను? అన్నాడు.

సామంతుడు మహరాజా! మీరు చెప్పినట్లు అతను మేధావి ఐతే అతన్ని పదవిలో వుంచడంలో తప్పులేదు. కానీ దానికి ముందు అతని ప్రతిభను పరీక్షించండి. అందులో అతను నెగ్గితే అతన్ని కొనసాగించండి. గౌరమివ్వండి. అన్నాడు.

ఐతే ఎలాంటి పరీక్ష పెట్టమంటావు? అన్నాడు రాజు. అతన్ని ఎల్లుండి కల్లా ఒక గ్లాసుడు ఎద్దుపాలు తీసుకురమ్మని అజ్ఞాపించండి అన్నాడు సామంతు.

రాజు ఇదేదో తమాషాగా వుందే, చూద్దాం అనుకున్నాడు. కానీ ఈ పరీక్షలో యువమంత్రి విజయం సాధిస్తాడని రాజుకు నమ్మకం. రాజు యువమంత్రిని పిలిచి ఎల్లుండికల్లా ఒక గ్లాసుడు ఎద్దు పాలు తీసుకురా అని ఆజ్ఞాపించాడు.

యువమంత్రి అక్కడ అక్కసు నిండిన సామంతుని చూశాడు. పరిస్థితి గ్రహించాడు. అంతటి క్లిష్టపరిస్థితిలోనూ చలించకుండా, సరే! మహారాజా! అని వెళ్ళాడు.

రాజు సామంతు కేసి చూసి చూశావు కదా! అతను ఎంత నిర్మలత్వమో! ఏదో అద్భుతం చేస్తాడు అన్నాడు. మొత్తానికి చిక్కాడు కదా! అని సామంతు మనసులో సంతోషించాడు.

మూడు రోజులయింది. యువమంత్రి ఒక గాజు గ్లాసును, దానిపై మూతపెట్టి తీసుకెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళమని తన చెల్లెల్ని పంపాడు. అతని చెల్లెలు వెళ్ళి రాజుగారి ముందు నిలబడింది. రాజు దగ్గర సమయానికి సామంతు కూడా వున్నాడు.

రాజు ఆ అమ్మాయిని చూసి నువ్వెందుకొచ్చావు మీ అన్న ఎందుకు రాలేదు అన్నాడు. రాజా!మా అన్న యిప్పుడే కొడుకును కన్నాడు అందుకే రాలేకపోయాడు, అంది.

రాజు నవ్వుతూ మగవాడు బిడ్డను కనడమా! అన్నాడు. ఆ అమ్మాయి తలవంచుకునే, ఎద్దుపాలివ్వగా లేనిది మగవాడు బిడ్డను కనలేడా? అంది. రాజు సామంతు వేపు చూశాడు. తన మంత్రి తెలివితేటలకు సంతోషించి ఆ అమ్మాయిని వెళ్ళమన్నాడు. ‘చూశావు కదా!మా మంత్రి మేథస్సు అన్నాడు.

సామంతు అప్పుడే ఏమయింది రాజా! యిది మొదటి పరీక్ష దీంట్లో నెగ్గాడు. ఈసారి, పదిహేను రోజుల్లో సాలెగూడుతో మీకు లాల్చీ నేసుకు రమ్మని ఆజ్ఞవేయండి. అప్పుడు చూడండి అన్నాడు.

రాజుగారికి యిదీ ముచ్చట వేసింది. వెంటనే మంత్రిని పిలిపించాడు. మళ్ళీ ఏదో వ్యవహరం వుందని మంత్రి ఆలోచించుకుంటూ రాజు దగ్గరికి వచ్చాడు. సామంతు అక్కడే వున్నాడు. మళ్లీ యింకో కుట్రకి పథకం పన్నుతున్నాడని మంత్రి వూహించాడు.

చూడు మంత్రీ! పదిహేను రోజుల్లోగా సాలెగూడుతో నాకు లాల్చీ వేసుకురా! అన్నాడు రాజు. మంత్రి ఎప్పట్లా సరే అని వెళ్ళిపోయాడు. యిక్కడ ఏదో అద్భుతం జరగబోతోందని రాజు భావించాడు.

పదిరోజులు మంత్రి సభకే రాలేదు. పదకొండో రోజు సభకు వచ్చాడు. చేతిలో ఒక పాత్ర వుంది. ‘రాజు ఏమిటది? అన్నాడు.

మంత్రి ‘రాజా! దయచేసి మీ ఉద్యానవనంలో వున్న కొలనుకు మంట పెట్టి కాల్చండి. ఆ నీటి బూడిదను కొద్దిగా ఈ పాత్రలో సేకరించి దాని సాయంతో సాలెగూడు ద్వారా మీ లాల్చీ నేస్తాను, అన్నాడు.

నీటికి మంట పెడితే బూడిద అవుతుందని ఎవరన్నారు, అన్నాడు రాజు ఎవరయితే సాలెగూడులో లాల్చీ నేయవచ్చని అన్నారో వారే, అన్నాడు.

నిజమే నేను కూడా వినలేదు. ఎవరో చెబితే అట్లాంటి లాల్చీ వేసుకుంటే బావుంటుందేమో అని ఆశపడ్డాను. సరే! జరిగిందేదో జరిగింది. నీ పనిలో నువ్వు చేరు, అన్నాడు.

సామంతు యిది విని రాజు హృదయంలో మంత్రికి స్థానం మరింత పెరిగింది. ఈసారి క్లిష్టమయిన సమస్య యివ్వాలనుకున్నాడు. రాజుగారితో ‘రాజా’! మీ యువమంత్రి రెండు పరీక్షల్లో నెగ్గాడు. ఈసారి చాలా కష్టమైన, పరిష్కరించలేని సమస్యను యిస్తాను. దాంట్లో నెగ్గితే అతనికి తిరుగు ఉండదు అన్నాడు.

రాజు ‘ఏమిటది’ అన్నాడు.

సామంతు అతని యింట్లోవున్న బావిని రాత్రికి రాత్రి తీసుకొచ్చి సంతలో మధ్యలో వుండేట్లు పెట్టమని చెప్పండి అన్నాడు.

రాజుకు యిది కూడా విచిత్రంగా అనిపించింది. మంత్రిని పిలిచి చెప్పాడు మంత్రి చలించకుండా సరేనని వెళ్ళి గంట తరువాత ఒక బలమైన తాడుతో సభలోకి వచ్చాడు. ‘రాజా! ఈ తాడు మొదలు నా బావికి కట్టాను. దాని చివర మీ బావికి కట్టి మీ బావిని లాగమనండి, అన్నాడు.

అదెట్లా వీలవుతుంది! అన్నాడు, మీరు చెప్పింది వీలయితే యిదీ అలాగే అన్నాడు మంత్రి,

మంత్రి తెలివికి రాజు సంతోషించి సత్కరించాడు. సామంతుకు దేశ బహిష్కారం విధించాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News