హెచ్ఐవి ఉందని... హాస్టల్ నుండి పంపేశారు!
ఓడిషాలోని ఒక ప్రభుత్వ పాఠశాల 13ఏళ్ల బాలికకు హెచ్ఐవి ఉందంటూ…హాస్టల్ వసతిని రద్దు చేసింది. కేంద్రాపరా జిల్లాలో ఉన్న జవహర్ నవోదయా రెసిడెన్షియల్ స్కూలులో చదువుతున్న బాలికకు స్కూలు యాజమాన్యం ఏడాది కాలంగా హాస్టల్ వసతిని రద్దు చేసింది. దాంతో ఆమె స్కూలుకి హాజరు కాలేని పరిస్థితిలో ఉంది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ హెచ్ఐవితో మరణించడంతో ఆమె తన మామయ్య వద్ద ఉండి చదువుకుంటున్నది. అయితే తాము ఉంటున్న గ్రామానికి స్కూలు 45 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో […]
ఓడిషాలోని ఒక ప్రభుత్వ పాఠశాల 13ఏళ్ల బాలికకు హెచ్ఐవి ఉందంటూ…హాస్టల్ వసతిని రద్దు చేసింది. కేంద్రాపరా జిల్లాలో ఉన్న జవహర్ నవోదయా రెసిడెన్షియల్ స్కూలులో చదువుతున్న బాలికకు స్కూలు యాజమాన్యం ఏడాది కాలంగా హాస్టల్ వసతిని రద్దు చేసింది. దాంతో ఆమె స్కూలుకి హాజరు కాలేని పరిస్థితిలో ఉంది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ హెచ్ఐవితో మరణించడంతో ఆమె తన మామయ్య వద్ద ఉండి చదువుకుంటున్నది. అయితే తాము ఉంటున్న గ్రామానికి స్కూలు 45 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రతిరోజూ ప్రయాణం చేయాలంటే కష్టమవుతుందని ఆమె మేనమామ తెలిపాడు.
హాస్టల్‌లో ఉంటున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతోనే స్కూలు ఇలాంటి నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్లో ఇలాంటి వివక్ష చూపటం అన్యాయమని బాలల హక్కుల కార్యకర్త ఒకరు ఆరోపించారు. పాఠశాల… బాలికకు హెచ్ఐవి ఉందని నిర్దారించడంపై ప్రశ్నిస్తూ, ఇది బాలల హక్కులను కాలరాయడమే అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హెచ్ఐవి ఉన్నపిల్లల చదువుకి ఆటంకం కలిగించడం నేరమని ఆ కార్యకర్త గుర్తుచేశారు. స్కూలు అధికారులపై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రస్తుతం బాలిక ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. పరీక్షలకు మాత్రమే స్కూలుకి హాజరవుతోంది.