జగన్ ఫొటోలపై కొత్త డౌట్ వదిలిన బాబు పత్రిక
కొన్ని మీడియా సంస్థలకు చంద్రబాబు అంటే, మరికొన్ని మీడియా సంస్థలకు జగన్ అంటే నరనరాల్లోనూ వ్యతిరేకత జీర్ణించుకుపోయినట్టుగా ఉంది. కళ్ల ముందు కనిపించేది కూడా నమ్మడానికి ఇష్టపడని స్థితికి మీడియా చేరిపోయింది. తాజాగా విదేశాల్లో జగన్ గోల్ఫ్ అడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జీన్స్ వేసి జగన్ గోల్ఫ్ అడుతున్న స్టిల్స్ చూసి ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. టీడీపీ అనుకూల పత్రిక ఒకటి మాత్రం ఎప్పటిలాగే జగన్ ఫొటోలపై కూడా నెగిటివ్ టచ్‌లోనే స్పందించింది. […]
కొన్ని మీడియా సంస్థలకు చంద్రబాబు అంటే, మరికొన్ని మీడియా సంస్థలకు జగన్ అంటే నరనరాల్లోనూ వ్యతిరేకత జీర్ణించుకుపోయినట్టుగా ఉంది. కళ్ల ముందు కనిపించేది కూడా నమ్మడానికి ఇష్టపడని స్థితికి మీడియా చేరిపోయింది. తాజాగా విదేశాల్లో జగన్ గోల్ఫ్ అడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జీన్స్ వేసి జగన్ గోల్ఫ్ అడుతున్న స్టిల్స్ చూసి ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. టీడీపీ అనుకూల పత్రిక ఒకటి మాత్రం ఎప్పటిలాగే జగన్ ఫొటోలపై కూడా నెగిటివ్ టచ్‌లోనే స్పందించింది.
జగన్ గోల్ఫ్ అడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని చెబుతూనే… సదరు పత్రిక అయితే ఆ ఫొటోలు నిజమైనవా లేక మార్ఫింగా అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదని రాసింది. ఈ ఫొటోలపై వైసీపీ నేతలు కూడా ఎవరూ స్పందించడం లేదని చెప్పింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సదరుమీడియా సంస్థకే చెందిన టీవీ ఛానల్ మాత్రం సదరు ఫొటోలు జగన్ ఈడెన్ బర్గ్‌లో గోల్ఫ్ అడుతున్నప్పటివని చెప్పింది. ఆ ఫొటోలు కూడా తమ ఛానల్ ప్రత్యేకంగా సంపాదించిందని కూడా చెప్పుకుంది. తీరా తెల్లవారేసరికి సొంత పత్రికలో మాత్రం ఇవి మార్ఫింగా లేక నిజమైన ఫొటోలా అన్న అనుమానం వ్యక్తం చేసింది. బహుశా జగన్ ఫొటోలను చూసి సంతోషపడుతున్న ఆయన అభిమానులకు కాసింత చేదును అందించాలన్న ఉద్దేశంతో ఈ కొత్త డౌట్ క్రియేట్ చేసిందేమో సదరు పత్రిక.
Click on Image to Read: