పందికి నామకరణోత్సవం చేశారు...రవీంద్ర చవాన్ అని పేరుపెట్టారు!
బిజెపి ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో ఏదో ఒక వర్గపు ప్రజల మనోభావాలను గాయపరుస్తూనే ఉన్నారు. గతంలో వికె సింగ్ అనే బిజెపి నేత దళితులను శునకాలతో పోల్చగా, ఇప్పుడు మహారాష్ట్ర డొంబివిలి నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నఎమ్మెల్యే రవీంద్ర చవాన్ పందులతో పోల్చాడు. థానేలోని కల్యాణ్ లో జరిగిన స్మార్ట్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దళితులను అన్నివిధాలా పైకి తెచ్చే కృషి చేస్తున్నారు… అని చెప్పటం […]
బిజెపి ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో ఏదో ఒక వర్గపు ప్రజల మనోభావాలను గాయపరుస్తూనే ఉన్నారు. గతంలో వికె సింగ్ అనే బిజెపి నేత దళితులను శునకాలతో పోల్చగా, ఇప్పుడు మహారాష్ట్ర డొంబివిలి నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నఎమ్మెల్యే రవీంద్ర చవాన్ పందులతో పోల్చాడు. థానేలోని కల్యాణ్ లో జరిగిన స్మార్ట్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దళితులను అన్నివిధాలా పైకి తెచ్చే కృషి చేస్తున్నారు… అని చెప్పటం కోసం ఏ మాత్రం పొంతనలేని కథ ఒకటి చెప్పాడు. ఆ కథతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
అబ్రహం లింకన్ మురికి కాల్వనుండి పందిపిల్లను తెచ్చి శుభ్రం చేశారని, అలాగే నరేంద్రమోడీ, దేవేంద్ర ఫడ్నవీస్ దళితులను పైకి తెస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చేస్తూ, తీవ్ర దుమారం రేపింది. చవాన్ క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్సిపి పార్టీ, చవాన్ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ పందికి నామకరణోత్సవం అనే కార్యక్రమం నిర్వహించి, దానికి రవీంద్ర చవాన్ అని పేరు పెట్టింది. ఈ వివాదంపై వ్యాఖ్యానించడానికి రవీంద్ర చవాన్ నిరాకరించాడు.