పిచ్చిపిచ్చి రాతలు వద్దు... కులతత్వం ఉన్నది ఎవరికి పత్రికాధిపతి...

కులతత్వం కారణంగానే ఉప్పునిప్పులా ఉండే దాసరి నారాయణరావు, చిరంజీవి కలిసిపోయారంటూ ఒక పత్రిక రాయడంపై వైసీపీ నేత అంబటిరాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వం ఉన్నది సదరు పత్రికాధిపతికా లేక మాకా అని ప్రశ్నించారు. తమ కులాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే కనీసం ప్రతిఘటించకుండా చేతులుకట్టుకుని కూర్చోవాలా అని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి సపోర్టు చేయడం ద్వారా అందరి వాడు అయిన చిరంజీవి కాస్త కొందరివాడు అయ్యాడంటూ టీడీపీ పత్రిక రాయడాన్ని తప్పుపట్టారు. ఒకవేళ చిరంజీవి కాపు […]

Advertisement
Update:2016-06-20 11:31 IST

కులతత్వం కారణంగానే ఉప్పునిప్పులా ఉండే దాసరి నారాయణరావు, చిరంజీవి కలిసిపోయారంటూ ఒక పత్రిక రాయడంపై వైసీపీ నేత అంబటిరాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వం ఉన్నది సదరు పత్రికాధిపతికా లేక మాకా అని ప్రశ్నించారు. తమ కులాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే కనీసం ప్రతిఘటించకుండా చేతులుకట్టుకుని కూర్చోవాలా అని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి సపోర్టు చేయడం ద్వారా అందరి వాడు అయిన చిరంజీవి కాస్త కొందరివాడు అయ్యాడంటూ టీడీపీ పత్రిక రాయడాన్ని తప్పుపట్టారు.

ఒకవేళ చిరంజీవి కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోయి ఉంటే ఇదే పత్రిక సొంతకులానికి అండగా ఉండలేని చిరంజీవి మిగిలిన కులాలకు ఏం న్యాయం చేస్తారంటూ రాసిఉండేదన్నారు. అసలు కాపు కులాన్ని రెచ్చగొట్టింది చంద్రబాబునాయుడేనని అంబటి ఫైర్ అయ్యారు.

ముద్రగడ ప్రాణాలకు ఏమైనా పర్వాలేదు అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కానీ… ముద్రగడకు ఏమైనా జరిగితే రాష్ట్రం ఏమవుతుందో చంద్రబాబు ఆలోచించుకోవాలన్నారు. పరిస్థితులు ప్రమాదకర స్థాయికి వెళ్తాయన్నారు. ముద్రగడతో చర్చల సందర్భంగా అధికారుల బృందం ఒప్పుకున్న అంశాలు కూడా అమలు కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని అంబటి మండిపడ్డారు. ముద్రగడకు ఏమైనా జరిగితే కాపులే కాదు ప్రజాస్వామ్యవాదులెవ్వరూ సహరించరని అంబటి అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News