ఏఎస్పీది హత్యనా? ఎస్‌ఐ ఎందుకు బెదిరిస్తున్నారు?
విశాఖ జిల్లా పాడేరు ఏఎస్‌పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై ఇంకా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఏఎస్పీది హత్య కూడా అయిఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అందుకు బలాన్ని చేకూర్చేలా కొన్ని విషయాలను వెల్లడించింది. శశికుమార్ ఎంతో ధైర్యవంతంగా పనిచేసేవారని, గతంలో ఎర్రచందనం స్మగర్ల ఆటకట్టించడంలో చాలా చురుగ్గా వ్యవహరించారని… విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లపైనా ఉక్కుపాదం మోపారని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదంటూ తోటి అధికారులే చెబుతున్నారు. […]
విశాఖ జిల్లా పాడేరు ఏఎస్‌పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై ఇంకా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఏఎస్పీది హత్య కూడా అయిఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అందుకు బలాన్ని చేకూర్చేలా కొన్ని విషయాలను వెల్లడించింది. శశికుమార్ ఎంతో ధైర్యవంతంగా పనిచేసేవారని, గతంలో ఎర్రచందనం స్మగర్ల ఆటకట్టించడంలో చాలా చురుగ్గా వ్యవహరించారని… విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లపైనా ఉక్కుపాదం మోపారని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదంటూ తోటి అధికారులే చెబుతున్నారు. అంతే కాదు చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు సిబ్బందితో శశికుమార్ మాట్లాడారని పత్రిక కథనం. అందరూ సిద్ధంగా ఉండాలని, వాహనాన్ని రెడీ చేయాలని సిబ్బందిని శశికుమార్ ఆదేశించారని కథనం. అలా ఆదేశించి లోనికి వెళ్లిన కొద్ది నిమిషాలకే ఆయన చాంబర్ నుంచి తుపాకీ పేలిన శబ్ధం వచ్చిందని చెబుతున్నారు.
సిబ్బందిని రెడీగా ఉండాలని ఆదేశించి వెళ్లిన శశికుమార్ ఆ సమయంలోనే సూసైడ్ నోట్ ఎలా రాసి ఉంటారన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారట. పైగా శశికుమార్ బంగ్లా వద్ద సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో దుండగులు నేరుగా లోనికి వెళ్లి హత్య చేసి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని పత్రిక కథనం. అంతేకాదు… ఒక ఎస్‌ఐ … ఈ కేసు విషయంలో స్థానిక విలేకర్లను బెదిరిస్తున్నారని సదరుపత్రిక రాసింది. శశికుమార్ మృతి గురించి, ఆయన రాసిన సూసైడ్ నోట్ గురించి ఆరా తీసినా, ప్రచురించినా తీవ్ర పరిణామాలుంటాయని సదరు ఎస్ఐ అందరినీ బెదిరిస్తున్నారట. ఏఎస్పీది ఆత్మహత్య అయితే ఎస్‌ఐ ఇలా ఎందుకు బెదిరింపులకు దిగుతారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తున్న కొందరు పోలీసుల చిట్టాను ఏఎస్ పీ సిద్దం చేశారని దాని వల్ల కూడా ఏమైనా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తవమవుతోందని ప్రముఖ పత్రిక కథనం.
Click on Image to Read: