బురదావతిగా మారిన అమరావతి... కుంగిన భవనం

చంద్రబాబు ప్రభుత్వం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక రాజధాని ప్రాంతం ఇప్పుడు బురదలో చిక్కుకుంది. శుక్రవారం కాసేపు కురిసిన  వర్షం కారణంగా తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్న ప్రాంతమంతా వర్షపు నీటితో నిండిపోయింది. బురదమయమైంది. ఈ పరిస్థితిని చూసి అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. భవనాల వద్దకువెళ్లే రోడ్లన్నీ బురదలో చిక్కుకున్నాయి. ఈనెల 27నాటికి ఉద్యోగులంతా వచ్చేయాలని చెబుతున్న ప్రభుత్వం ఇక్కడి ఏర్పాట్లను మాత్రం పూర్తి చేయలేకపోతోంది. ముందే నల్లరేగడి ప్రాంతం కావడంతో కాస్త వర్షం పడితే చాలు బురదమయమవుతోందని […]

Advertisement
Update:2016-06-18 06:02 IST

చంద్రబాబు ప్రభుత్వం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక రాజధాని ప్రాంతం ఇప్పుడు బురదలో చిక్కుకుంది. శుక్రవారం కాసేపు కురిసిన వర్షం కారణంగా తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్న ప్రాంతమంతా వర్షపు నీటితో నిండిపోయింది. బురదమయమైంది. ఈ పరిస్థితిని చూసి అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. భవనాల వద్దకువెళ్లే రోడ్లన్నీ బురదలో చిక్కుకున్నాయి. ఈనెల 27నాటికి ఉద్యోగులంతా వచ్చేయాలని చెబుతున్న ప్రభుత్వం ఇక్కడి ఏర్పాట్లను మాత్రం పూర్తి చేయలేకపోతోంది. ముందే నల్లరేగడి ప్రాంతం కావడంతో కాస్త వర్షం పడితే చాలు బురదమయమవుతోందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలం పూర్తి స్థాయిలో వస్తే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. భవనాల వద్దకు వెళ్లాలంటే చెప్పులు చేతపట్టుకుని బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. వాహనాలు కూడా వెళ్లేపరిస్థితి లేదు. ఇటీవల చంద్రబాబు ఐదు కోట్ల బస్సు కూడా ఈ బురదలో చిక్కుకుపోయింది. ఇప్పటికే నిర్మించిన రోడ్లు కూడా బురదనీటిలో మునిగిపోయాయి. డ్రైయినేజ్‌ నిర్మించి, కాస్త ఎత్తుగా రోడ్లు నిర్మిస్తే గానీ తాత్కాలిక భవనాల వద్దకు వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు.

మరోవైపు తాత్కాలిక రాజధాని భవనాలు నిర్మిస్తున్న సమీప ప్రాంతంలోని ఒక మూడంతస్తుల భవనం ఒకటి వర్షానికి కుంగిపోవడం కలకలం రేపింది. గోపిరాజు అనే వ్యక్తి గతంలో నిర్మించిన భవనంపై అదనపు అంతస్తులునిర్మించేందుకు ప్రయత్నిస్తుండగా భవనం కుంగిపోయింది. దీంతో దాన్ని జాకీల సాయంతో పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంక్రీట్ దిమ్మెలతో పిల్లర్లు వేసినప్పటికీ భవనం కుంగిపోవడంతో… ఈ ప్రాంతంలోని సాయిల్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెత్తని నేల కావడంతో ఇక్కడ బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం సరికాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News