ఉడ్తా పంజాబ్‌కి పోటీగా...ప్రభుత్వ ఉభర్దా పంజాబ్!
పంజాబ్‌లో ఉన్న డ్రగ్స్ వినియోగం, మాఫియాని ఉన్నది ఉన్నట్టుగా చూపించడం భరించలేని ప్రభుత్వం దానికి సెన్సార్ బోర్డు ద్వారా ఎన్నో ఆటంకాలను కల్పించడం చూస్తున్నాం. అసలు సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ప్రభుత్వం ఈ సినిమా ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉడ్తా పంజాబ్ ట్రైలర్ యూట్యుట్లో ఏప్రిల్ 16న విడుదలైన తక్షణమే, ఉభర్దా పంజాబ్ (పురోగమంలో పంజాబ్) పేరుతో ఒక కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. డ్రగ్ వ్యసనాన్ని నిర్మూలించడానికి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో […]
పంజాబ్లో ఉన్న డ్రగ్స్ వినియోగం, మాఫియాని ఉన్నది ఉన్నట్టుగా చూపించడం భరించలేని ప్రభుత్వం దానికి సెన్సార్ బోర్డు ద్వారా ఎన్నో ఆటంకాలను కల్పించడం చూస్తున్నాం. అసలు సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ప్రభుత్వం ఈ సినిమా ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉడ్తా పంజాబ్ ట్రైలర్ యూట్యుట్లో ఏప్రిల్ 16న విడుదలైన తక్షణమే, ఉభర్దా పంజాబ్ (పురోగమంలో పంజాబ్) పేరుతో ఒక కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. డ్రగ్ వ్యసనాన్ని నిర్మూలించడానికి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులను, ప్రజాప్రతినిధులను, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను, మత పెద్దలను లేదా యూత్క్లబ్ ప్రతినిధులను భాగస్వాములను చేశారు. వీరంతా డ్రగ్ ఎడిక్షన్కి గురయిన వారిని, వారి కుటుంబాలను పరామర్శించి తగిన కౌన్సెలింగ్ అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇందులో సైకియాట్రిస్ట్లు గానీ, వైద్యపరమైన వృత్తినిపుణులు కానీ లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఈ రెండు రంగాలవారు లేకుండా ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందని, కుటుంబాలకు, బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తే చాలదని, బాధితులకు మందులతో కూడిన ఒపియాడ్ సబ్‌స్టిట్యూట్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. పంజాబ్లో ప్రారంభిస్తున్న పునరుద్ధరణ కేంద్రాల్లో కూడా ఇలాంటి థెరపీలు ఇవ్వటం లేదని, ఇక ఇదేం పరిష్కారనే విమర్శలు వినబడుతున్నాయి.
మే 14 నుండి ఉభర్దా పంజాబ్ అమలుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ఉన్నవారికి గుర్తింపు కార్డులను, ప్రోత్సాహకాలుగా రివార్డులను ఇస్తున్నారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి, 22 డ్రగ్ రిహ్యాబిలిటేషన్ కేంద్రాల ఏర్పాటుకి గత ఏడాదే 61.89 కోట్లు మంజూరు అయ్యాయని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ప్రభుత్వ ప్రయత్నాలను ఒక పక్కనుంచితే పంజాబ్లో డ్రగ్ వినియోగ తీవ్రతపై ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఒపియాడ్ డిపెండెన్స్కి గురయినవారు (డ్రగ్స్ తీసుకోకపోతే విత్డ్రాయల్ సింప్టమ్స్ ని భరించలేని స్థితి ) రాష్ట్రంలో 2.32 లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఒక్క తడవ ట్రీట్మెంట్ని అందించాలన్నా రాష్ట ప్రభుత్వానికి పదేళ్లు పడుతుందని ఎయిమ్స్ తన నివేదికలో పేర్కొంది.