మా నాన్న గారికి వయసు పెరిగే కొద్దీ...

హీరో బాలకృష్ణ 57వ జన్మదిన కార్యక్రమం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగింది. క్యాన్సర్ బాధితుల సమక్షంలో బాలయ్య కుమార్తె బ్రహ్మణి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె … తన తండ్రి 56 ఏళ్లు పూర్తి చేసుకున్నారంటే తనకే ఆశ్చర్యంగా ఉందన్నారు. సాధారణంగా వయసు పెరిగే కొద్ది అందరికీ ఎనర్జీ తగ్గుతుందని కానీ తన తండ్రి మాత్రం అందుకు రివర్స్ అన్నారు. బాలకృష్ణకు వయసు పెరిగే కొద్దీ ఎనర్జీ పెరుగుతోందని బ్రహ్మణి చెప్పారు. ఇప్పటికీ […]

Advertisement
Update:2016-06-10 09:18 IST

హీరో బాలకృష్ణ 57వ జన్మదిన కార్యక్రమం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగింది. క్యాన్సర్ బాధితుల సమక్షంలో బాలయ్య కుమార్తె బ్రహ్మణి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె … తన తండ్రి 56 ఏళ్లు పూర్తి చేసుకున్నారంటే తనకే ఆశ్చర్యంగా ఉందన్నారు. సాధారణంగా వయసు పెరిగే కొద్ది అందరికీ ఎనర్జీ తగ్గుతుందని కానీ తన తండ్రి మాత్రం అందుకు రివర్స్ అన్నారు. బాలకృష్ణకు వయసు పెరిగే కొద్దీ ఎనర్జీ పెరుగుతోందని బ్రహ్మణి చెప్పారు. ఇప్పటికీ మనవడితో చిన్నపిల్లాడిలా ఆడుకుంటారని చెప్పారు. మానవసేవే మాధవ సేవ అని చిన్నప్పటి నుంచి తన తండ్రి చెప్పేవారన్నారు బ్రహ్మణి. ఈ సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఫస్ట్ లుక్‌ను బ్రహ్మణి విడుదల చేశారు. కార్యక్రమంలో శాతకర్ణి చిత్రయూనిట్ సభ్యులు, డైరెక్టర్ జాగర్లమూడి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News