ఎన్టీఆర్ నుంచి చోటా తమ్ముళ్ల వరకు వాడిన బూతులు

ఒక ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టాలి అని వ్యాఖ్యానించడాన్ని ఎవరూ సమర్ధించరు. కానీ అప్పటి వరకు పరమపవిత్రంగా ఊరేగుతున్నరాజకీయాలు ఒక్క జగన్ వ్యాఖ్యలతోనే శీలం కోల్పోయాయా?. అసభ్యకర మాటలు మాట్లాడడం జగన్‌తోనే మొదలైందా?. టీడీపీ నేతలకు అసలు బూతు మాటలే తెలియవా?. ఒక సారి చరిత్ర తిరగేస్తే ఎన్టీఆర్ నుంచి బాబు భజనపరుల వరకూ ఎన్నోఅసభ్యకరమైన మాటలు వాడారు. ఒకసారి శాసనసభలో ఒక అంశంపై మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారి ”ఇవిగో ఆధారాలు అంటూ” కొన్ని పత్రాలు చూపించారు. దీంతో […]

Advertisement
Update:2016-06-04 04:16 IST

ఒక ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టాలి అని వ్యాఖ్యానించడాన్ని ఎవరూ సమర్ధించరు. కానీ అప్పటి వరకు పరమపవిత్రంగా ఊరేగుతున్నరాజకీయాలు ఒక్క జగన్ వ్యాఖ్యలతోనే శీలం కోల్పోయాయా?. అసభ్యకర మాటలు మాట్లాడడం జగన్‌తోనే మొదలైందా?. టీడీపీ నేతలకు అసలు బూతు మాటలే తెలియవా?. ఒక సారి చరిత్ర తిరగేస్తే ఎన్టీఆర్ నుంచి బాబు భజనపరుల వరకూ ఎన్నోఅసభ్యకరమైన మాటలు వాడారు. ఒకసారి శాసనసభలో ఒక అంశంపై మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారి ”ఇవిగో ఆధారాలు అంటూ” కొన్ని పత్రాలు చూపించారు. దీంతో ఆగ్రహించిన అప్పటి సీఎం ఎన్టీఆర్ ”వాటిని మడిచి….లో పెట్టుకో” అని అసెంబ్లీలోనే అనేసి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. ఇది జరిగింది కూడా ఇంకా రాజకీయాల్లో విలువలున్నాయని భావించిన కాలంలోనే.

ఇక ఇటీవల టీడీపీ నేతల అసభ్యమాటలను రికార్డు చేసుకోవాలంటే పుస్తకాలు కావాల్సిందే. చెప్పు దెబ్బల వ్యాఖ్యలకే తెగ ఫీలైపోతున్న చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉంటూ అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఏమన్నారో గుర్తులేదా?. ”కాంగ్రెస్ నేతలంతా అడవి పందుల్లా రాష్ట్రం మీదపడ్డారు. పందికొక్కుల్లా తినిబలిశారు” అని ప్రతి మీటింగ్‌లోనూ బాబు చెప్పేవారు. అసెంబ్లీలోనే వైసీపీ సభ్యులను ”హేయ్… పిచ్చిపిచ్చిగా ఉందా ఖబర్దార్…తొక్కేస్తా, మీ అంతుచూస్తా” అని లెక్కలేనన్ని సార్లు ఇదే గౌరవనీయులైన ముఖ్యమంత్రి హెచ్చరించారు. అంతుచూడడం కంటే చెప్పు దెబ్బలే ప్రమాదకరమా?. రాజకీయ నాయకులు పతివ్రతల్లా బతకాలని ప్రవచనాలు చెప్పే బోండా ఉమా ఇదే అసెంబ్లీ వేదికగా ”ఏంట్రా ఏంట్రారేయ్…పాతేస్తా నాకొడకా..” అంటే ఇప్పటి వరకు బోండాపై చర్యలు తీసుకున్న మొగాడే లేడు.

ఆంధ్రప్రదేశ్‌కు తానో దేవుడు అన్నట్టు ఫీలవుతున్న చంద్రబాబు… అదే రాష్ట్రంలో అంతర్భామైన రాయలసీమను కించపరుస్తూ ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ రాయలసీమ గుండాలు అంటూ కించపరుస్తూనే ఉన్నారు. దానితో పోలిస్తే చెప్పు దెబ్బల తీవ్రత ఎక్కువేమీ కాదు. వైఎస్ చనిపోయిన కొద్ది రోజులకే రేవంత్‌ లాంటి వారు ”టీడీపీతో పెట్టుకున్న వైఎస్‌ పావురాలగుట్టలో పావురమైపోయాడు” అంటూ సంస్కారం లేని మాటలు మాట్లాడినప్పుడు బాబుతో పాటు ఆయన డబ్బా మీడియా అలా అనడం తప్పు కదా అని రేవంత్‌ను మందలించలేదే!. ”జగన్‌ నీ చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటాం” అని టీడీపీ నేతలన్నప్పటికీ చెప్పుల విలువ తెలిసిన చంద్రబాబు మందలించలేదే. ”అమ్మాయి కనిపిస్తే ముద్దాయిన పెట్టాలి తీసుకెళ్లి కడుపైనా చేయాలి” అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వాఖ్యల కంటే జగన్ వ్యాఖ్యలు తీవ్రమైనవా అన్నది కూడా ఆలోచించాలి..

అసభ్యకరం అన్న పదానికే అర్థం తెలియని అమాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరు. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు చేయగానే బూతుబూతు అంటూ కేకలుపెడుతున్నారు. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి… ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని ” రేయ్‌ రఘువీరా! నేను తలుచుకుంటే నీ ఇంటికి వచ్చి బట్టలూడదీసి కొడుతా” అన్నప్పుడు ఆయన సంస్కారం పెన్నానది వంతెన వద్ద దాక్కుంది కాబోలు!. చంద్రబాబుతో పాటు ఆయన భజనబృందం ….” జగన్ ఒక సైకో, ఉన్మాది, ఉగ్రవాది, పిచ్చోడు” అని దూషించకుండా నిర్వహించిన ప్రెస్ మీట్ ఉందా?. అయినా తెలుగు రాజకీయ నాయకుల నోట అసభ్యకరమైన మాటలు కామనైపోయి… వాటికి జనం కూడా అలవాటు పడ్డారు. కానీ ఒక్క చెప్పుదెబ్బల కామెంట్స్‌కు మాత్రమే టీడీపీ నేతలు ఇంతగా ఉలిక్కిపడడం విచిత్రమే. అందులోనూ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఉలిక్కిపడడం మరీ విచిత్రం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News